Friday, May 3, 2024

చెరకు రైతులకు గిట్టుబాటు ధర రూ.290

- Advertisement -
- Advertisement -

Union cabinet approves increase in FRP on Sugarcane to Rs 290 per quintal

కేంద్ర మంత్రి మండలి నిర్ణయం
చక్కెర లభ్యతను బట్టి ధర
మార్కెట్‌లో షుగర్ రేటు నిలకడే
ఇథనాలు పెంపుతో లాభం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చెరకు రైతులకు సమంజస, గిట్టుబాటు ధర (ఎఫ్‌ఆర్‌పి)ను క్వింటాలుకు రూ 290 గా ఖరారు చేసింది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ) ఈ మేరకు బుధవారం నిర్ణయం తీసుకుంది. 2021 22 మార్కెటింగ్ సంవత్సరం ( అక్టోబర్ సె ప్టెంబర్) దశలో ఈ ధర వర్తిస్తుంది. దీని మేరకు మార్కె టింగ్ సంవత్సరంలో చెరకు రైతులకు చక్కెర మిల్లుల యాజమాన్యాలు చెల్లించే ధర క్వింటాలుకు రూ 5 చొ ప్పున పెంచుతూ రూ. 290 చెల్లించాల్సి ఉంటుంది. చక్కెర విక్రయ ధరను తక్షణం పెంచే యోచన లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ప్రభుత్వం చెరకు ఎఫ్‌ఆర్‌పిని 2020 21 సంవత్సరానికి క్వింటాలుకు రూ 285గా ఖరారు చేసింది. చెరకు రైతుకు ఎఫ్‌ఆర్‌పి పెంపుదల నిర్ణయం గురించి కేబినెట్ కమిటీ భేటీ తరువాత కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ విలేకరులకు తెలిపారు. క్వింటాలుకు రూ 290 ఖరారును 10 శాతం రికవరి రేటు ప్రాతిపదికన చేపట్టా రని వివరించారు. ఈ రికవరీ చెరకు నుంచి ఉత్పత్తి అ య్యే చక్కెర పరిణామాన్ని బట్టి ఉంటుంది. ఇది రాష్ట్రాల వారిగా మారుతోంది. ఇక క్వింటాలుకు రూ 2.90 ప్రీ మియంను ప్రతి 0.1 నుంచి పది శాతం రికవరీపై ఉం టుంది. ఇక రికవరీలో ప్రతి 0.1 శాతం తగ్గుదల ఉంటే క్వింటాలు ఎఫ్‌ఆర్‌పిలో రూ 2.90 కుదింపు జరుగుతుం ది.

రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు 9.5 శా తం కన్నా తక్కువ రికవరీ ఉంటే ఎటువంటి తగ్గింపు ఉండదని మంత్రి తెలిపారు. ఇటువంటి రైతులకు క్విం టాలుకు రూ 270.75 గిట్టుబాటు ధర 202122 సం వత్సరానికి అందుతుంది. ఇంతకు ముందటి రూ 270. 75 బదులుగా ఇది వర్తిసుంది. 2021 22 సంవత్సరా నికి చెరకు పంట సాగు వ్యయం క్వింటాలుకు రూ 155గా ఉంది. దీనితో పోలిస్తే పది శాతం రికవరీ రేటు ఉన్నట్లు అయితే మొత్తం సాగు వ్యయంలో ఎఫ్‌ఆర్‌పి 87 శాతాన్ని దాటుతుందని మంత్రి తెలిపారు. ఈ విధంగా చెరకు సాగు ఇతర పంటలతో పోలిస్తే మరింత గిట్టుబా టుగా ఉంటుందని తెలిపారు. ఇప్పుడు ఎఫ్‌ఆర్‌పి పెంపు దల నిర్ణయంతో దాదాపు 5 కోట్ల మంది రైతులు, వారిపై ఆధారపడేవారు, వీరితో పాటు షుగర్ మిల్లుల్లోని దాదా పు 5 లక్షల మంది వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుంద ని వివరించారు. ఎఫ్‌ఆర్‌పిని పెంచడం వల్ల ప్రభుత్వం మార్కెటులో చక్కెర కనీస విక్రయ ధర (ఎంఎస్‌పి)ను పెంచుతుందా? అనే ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ఈ అవసరం లేదన్నారు. ప్రభుత్వం చక్కెర ఉత్పత్తులు, ఇథనాల్ ఉత్పత్తిని తగు విధంగా పెంచేందుకు అన్ని వి ధాలుగా మద్దతు ఇస్తోందని తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత ప్రస్తుతానికి మార్కెట్ లో చక్కెర ధరలు పెరగకపోవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ మార్కెట్‌లో ఇప్పటికీ చక్కెర ధరలు నిల కడగానే ఉన్నాయన్నారు. ఇప్పుడు దేశంలో చక్కెర ధర కిలోకు రూ. 31న టోకున లభిస్తోందని చెప్పారు. ప్రభు త్వం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొంటోంది. ఓవైపు రైతుల ప్రయోజనాలు, ఇదే సమయంలో విని యోగదారులు, చక్కెర పరిశ్రమల వారికి ఇబ్బంది కల గకుండా ఎప్పటికప్పుడు అత్యంత సున్నితమైన సమతూ కత పాటించడం జరుగుతోందని తెలిపారు. రైతులు ఆ ధునిక సాంకేతికతను వాడుకోవడం, వినూత్న వ్యవసా య విధానాలకు వెళ్లడం వల్ల చెరకులో షుగర్ స్థాయి లభ్యత పెరుగుతోందని చెప్పారు.

ఎగుమతుల వాటాలో ముందుకు

ఇక దేశం నుంచి చక్కెర ఎగుమతుల గురించి వివరిస్తూ ఇది ఆశాజనకంగా ఉందన్నారు. షుగర్ మిల్లులు ప్రస్తు త మార్కెటింగ్ సంవత్సరం 202021కు సంబంధించి 70 లక్షల టన్నుల ఎగుమతి కాంట్రాక్టులు దక్కిం చుకున్నాయని తెలిపారు. ఇందులో ఇప్పటికే 55 లక్షల టన్నుల మేర రవాణా జరిగింది. మిగిలిన 15 లక్షల ట న్నులు ఎగుమతి దశలో ఉన్నాయని చెప్పారు. మిల్లులు తమ ఎగుమతుల శాతాన్ని మరింతగా పెంచుకునేందు కు ప్రభుత్వం వాటికి ఆర్థిక సాయం అందిస్తోందని మం త్రి విలేకరులకు తెలిపారు. ఇక తమ పంట చెల్లింపులు సకాలంలో వచ్చేలా చేసేందుకు అనుగుణం గా షుగర్ ఎగుమతులను ప్రోత్సహిస్తుందని చెప్పారు.

ఇథనాల్‌తో కీలక మలుపు

కొద్ది సంవత్సరాలుగా పెట్రోలులో ఇథనాల్ మిళితం పె రుగుతూ వస్తోందని, చక్కెర ఉత్పత్తి కాగా మిగిలిన చెర కును ఇథనాల్ కోసం వినియోగించుకోవడం జరుగు తోందన్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చక్కెర ఫ్యాక్టరీలు , డిస్టిలరీల నుంచి ఇథనాలు అమ్మకాలు జరు గుతున్నాయి. ఈ విధంగా గత మూడు షుగర్ సీజన్లలో మిల్లులకు మొత్తం మీద రూ 22,000 కోట్ల మేర ఆదా యం సమకూరింది. ఇప్పటి షుగర్ సీజన్ (2020 21)కు సంబంధించి ఈ విధంగా వారికి రూ 15000 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇది ఇకపై ఏటా రూ 40,000 వరకూ చేరుతుందని అన్నారు. ఈ పరిస్థితితో చెరకు రై తులకు బకాయిలు పెట్టకుండా మిల్లులు వ్యవహరించేం దుకు వీలేర్పడుతుందన్నారు. ఇప్పుడున్న స్థాయితో పోలి స్తే వచ్చే మూడేళ్లలో పెట్రోలులో ఇథనాలు మిశ్రమ ప్రక్రి య 20 శాతం పెరుగుతుందని, ఇది పరోక్షంగా చెరకు రైతుకు, మిల్లులకు ఉపయుక్తం అవుతుందన్నారు.

ఎప్పటికప్పుడు తగ్గుతున్న బకాయిలు

ఎప్పటికప్పుడు చెరకు రైతులకు బకాయిలు చెల్లింపులు వేగవంతం అవుతున్నాయని పీయూష్ చెప్పారు. గత ఏ డాది ( 201920)లో దాదాపు రూ 75,845 కోట్ల చెల్లింపులు జరిగాల్సి ఉంది. వీటిలో అత్యధిక శాతం అంటే రూ 75,703 కోట్ల వరకూ బకాయిల చెల్లింపులు జరిగాయి. ఇక ఇప్పుడు మిగిలిన బకాయిలు కేవలం రూ 142 కోట్లు అని మంత్రి వివరించారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో చెరకు బకాయిలు మొత్తం రూ 90,959 కోట్లు కాగా, ఇందులో ఇప్పటికీ రూ 86,238 కోట్ల మేర చెల్లింపులు జరిగాయని చెప్పారు.

ఈ సందర్భంగా మం త్రి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వరుసగా మూడు మార్కెటింగ్ సంవత్సరాల కు సంబంధించి చెరకు రైతుల బకాయిలు లేకుండా చేసిందని చెప్పి, అక్కడి యోగి ఆదిత్యానాథ్ సారధ్యపు ప్రభుత్వాన్ని కొనియాడారు. ఎగుమతుల పెంపుదల, చెరకును ఎక్కువగానే ఇథనాల్‌కు కేటాయించడం వంటి పరిణామాలతో రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించ డం జరుగుతోందని లోగుట్టును తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News