Saturday, May 4, 2024

పరిణామ ఫలం జానపద కళాప్రదర్శనం!

- Advertisement -
- Advertisement -

No Art form is neither static, stationary nor sedentary. Art is very dynamic in its nature, style and presentation. As such the art forms across the globe have the essential quality of transforming themselves from one form to other or various dimensions of the same form from time to time, according to the changes in the ideology and demands of the public. Moreover, the art forms, with the changes as per the times, will enrich, expand, enhance themselves from earlier shape and style to the next level and will continue their legacy beyond generations and establish themselves as the tradition. In this series, folk arts are the true examples of this transformation, which made them to continue till date, even after centuries of their origin. Especially the folk arts of Telangana have survived against all odds with the patronage, support and encouragement from the people and conquered the threat of extinction.

పైన చెప్పినట్టు కళలు అంతరించిపోకుండా అనాదికాలం నుంచీ కొనసాగుతూ వస్తున్నాయంటే, దాని వెనుక ఉన్న ప్రధాన సూత్రం ఆయా కళారూపాలు మారుతున్న పరిస్థితులు, కాలాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తమ రూపురేఖ, ప్రదర్శనా రీతులను మార్చుకుంటూ రావడమే అని చెప్పవచ్చు. ఇలా నిరంతర మార్పులతో, నిత్య చైతన్య శీలంగా ఉన్న కళారూపాలలో జానపద కళారూపాలను ప్రత్యేకంగా ప్రస్తావించవచ్చు. అందుకే Cultural Anthropologists ‘కళల పరిణామ క్రమమే మానవ పరిణామం‘ (Human evolution, in other words, is nothing but the evolution of arts’) —– ప్రకటించారు.
జానపద కళలు – ప్రదర్శనా విధానం- పరిణామం:
మానవుడు తొలిసారిగా సామూహిక జీవనాన్ని ప్రారంభించిన కాలం నుంచి జానపద కళలు అతనితో పాటే రూపొంది కొనసాగుతూ వచ్చాయి. అయితే ఈ జానపద కళలు క్రమ పరిణామం చెందుతూ ఆయా కాలమాన పరిస్థితులను, ఆయా దశలలో రూపొందిన అవసరాలను అనుసరించి ఎలా మార్పులు చెందుతూ వచ్చాయో, ఆ మార్పులన్నీ వాటి ప్రదర్శన విధానంలో సంభవించిన పరిణామంలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. తొలినాటి జానపద కళల ప్రదర్శన అంతా మౌఖికంగా మాత్రమే ఉండేది. కానీ, క్రమక్రమంగా అభినయ, నృత్య, నాట్య నటన, ఆంగిక, ఆహార్య రూపాలను సంతరించుకుని నేటి దశకు చేరుకుంది. ఈ పరిణామ వికాస రీతులను నాలుగు దశలలో చెప్పవచ్చు.

మౌఖిక శైలి: ఈ మౌఖిక శైలిలో తొలి తరం నాటి జానపద కళలు, ఆదిమ కాలపు జానపద కళలు మనిషి నోరు, భాష కేంద్రితంగా ఉండేవి. (Oral-centric traditions) ఆశువుగా నోటిద్వారా కథన శైలిలో రాగం, స్వరంతో కలిసిన ప్రదర్శన రూపంగా ఇవి ఉండేవి. ఆయా రకాల కథలన్నీ మౌఖిక శైలిలో వివరిస్తున్నప్పుడు గొంతే ప్రధానంగా ఈ కళల ప్రదర్శన ఉంటూ, ఆ గొంతులోని తారతమ్యాలు స్వరాల స్థాయి ద్వారానే అన్ని రకాల పాత్రల్ని గొంతులోనే పలికించే విధానం ఆచరణలో ఉండేది.
ఈ తొలి తరం జానపద కళల్లో ప్రధాన ఆకర్షణ గొంతులోని స్వరస్థాయీ భేదాలతోనే నాటకీకరణ చేయడం, పాత్రానుగుణ్యమైన స్వరాలని అనుకరించడం అని చెప్పవచ్చు. పాత్ర స్వభావాన్ని ఆధారంగా చేసుకుని దానికి తగిన స్వరాన్ని రాగ, భావ, ఉద్వేగయుక్తంగా గానం చేస్తూ మౌఖిక సంప్రదాయ పద్దతుల్లోనే తొలినాటి జానపద కళలు ప్రజలందర్నీ అలరించాయి. వినోదాన్ని పంచాయి. వికాసాన్ని అందించాయి.

సంగీత వాయిద్యాల తోడు : క్రమక్రమంగా మానవుడు ప్రకృతిలోని చెట్టు, కర్రల ఆధారంగా, అలాగే జంతువుల చర్మం ఆధారంగా వివిధ రకాల ధ్వని ఉత్పత్తి సాధనాలను, పరికరాలని కనుక్కున్నాడు. అప్పటినుంచీ ఈ జానపద కళల్లో మౌఖిక కళా ప్రదర్శనకి తోడుగా ధ్వనిని సృష్టించే వాయిద్యాల జోడుకట్టాయి. కథలు చెప్పే విధానంలో, జానపద కళలను ప్రదర్శించే విధానంలో అవిభాజ్యమైన ప్రత్యేక సంగీత వాయిద్యాలుగా పరిణమించాయి. ఆ తర్వాత జంతువుల చర్మాలను వివిధ రకాల పాత్రలూ, వస్తువుల మీద అతికించి దాన్ని లయబద్ధంగా చేతితో లేదా కర్రలతో తాడించడం ద్వారా, ఒక వాంఛిత ధ్వనిని సృష్టించారు. ఆ తర్వాత వెదురుబొంగుల లోంచి వాయువులను పంపడం, గాలితో ఊదడం ద్వారా ఒక శ్రావ్యమైన ధ్వనిని, ఆ తర్వాత స్వరాలని, సంగీతాన్ని సృష్టించే నైపుణ్యం పెరగడం వల్ల పిల్లనగ్రోవి నాదాలు మొదలయ్యాయి వాటితోపాటు లోహాల గురించి మానవుడికి తెలిసిన తర్వాత, ఆ లోహాలను తీగలుగా తయారు చేసి, ఆ తంత్రుల మీద చేతులు, లేదా మరో లోహంతో తాడనం చేయడం ద్వారా సంగీతాన్ని సృస్టించవచ్చు అనే రహస్యం తెలిసిన తర్వాత సంగీత వాయిద్య పరికరాలలో గొప్ప విప్లవం వచ్చింది వాటి ద్వారానే తంత్రీ వాయిద్యాలు కూడా జానపద కళల ప్రదర్శనలో మౌఖిక విధానానికి, సంగీత వాయిద్యాలకి తోడుగా జతగూడటం జరిగింది. జానపద కళల ప్రదర్శనా పరిణామంలో దీనిని రెండవ దశగా భావించవచ్చు.

చిత్రాలు, బొమ్మల తోడు : మానవుడు తన ఆలోచన, మేధ, జ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ, తాను చూసిన, విన్న, అనుభూతి చెందిన వస్తువులు, వ్యక్తులు, జంతువులు, దృశ్యాల ప్రతి రూపాలని చిత్రించేనైపుణ్యాన్ని కూడా సాధించాడు. తను చూసిన, తన చుట్టూ ఉన్న ప్రపంచం, తనకు ఎదురైన జీవులు, వాటన్నిటినీ అనుకరిస్తూ వాటిని చిత్రాల రూపంలో దృశ్యమానం చేయడం ప్రారంభించాడు. వాటి చుట్టూ కాల్పనికతని, సృజనాత్మకతను జోడించి కథలు అల్లడం ప్రారంభించాడు. ఆ కథలు మౌఖిక సంప్రదాయ శైలిలో నడుస్తూనే మరొకవైపున ఆ కధనాలు మరింత రక్తి కట్టడానికి దానికి తోడుగా సంగీత వాయిద్యాలను కూడా ఉపయోగించాడు. ఈ దశ వరకూ మనిషి జ్ఞానేంద్రియాలలోని చెవికి, నోరుకు మాత్రమే పని కల్పించాడు. ఉల్లాసాన్ని అందించాడు. కానీ దృష్టిని అందించే కన్నుకు కూడా ఉత్తేజాన్ని అందించడానికి చిత్రాలను ఆసరాగా తీసుకున్నాడు. కళా ప్రదర్శనలో చెపుతున్న కథాగానానికి తగిన దృశ్యాన్ని చూపించడానికి.

అలాంటి ఒక రూపాన్ని చూస్తూ కళాకారుడు మరింత ఉద్వేగంగా కథాగానం చేయడానికి, చూసే ప్రేక్షకులు కథానుభూతిని మాత్రమే కాకుండా, పాత్రల రూపాలతో లీనం కావడానికి, ఉద్విగ్నతను కూడా పొందడానికి చిత్రాలు, బొమ్మలు దోహదపడ్డాయి. వాటిలో పటచిత్రాలు, తోలు బొమ్మలు, కొయ్య బొమ్మలు ఉన్నాయి. కథలోని పాత్రానుగుణంగా చేసిన బొమ్మలకు తగిన ఆహార్య, వస్త్ర, అలంకరణ ద్వారా కథలు చెప్పే విధానం కూడా జానపద కళల ప్రస్థానంలో అమలులోకి వచ్చింది. ఇది మూడవ దశ.దీని ద్వారా దృశ్య శ్రవణ విధానం ద్వారా కలిగే అనుభూతినిప్రేక్షకులకు మొదటిసారి కల్పించడం జరిగింది అంతకుముందు జ్ఞానేంద్రియాలలో చెవికీ, వినికిడికి సంబంధించిన అంశం ద్వారా మాత్రమే కళల ప్రదర్శన జరుగుతూ వచ్చింది మూడవ దశ వచ్చిన కాలంలో చెవులకి మాత్రమే కాకుండా, కనులకి కూడా దృశ్య మాధ్యమం ద్వారా జానపద కళల్ని ప్రదర్శించడం అనే ప్రక్రియ ప్రారంభం అవడంతో అందరూ ఒక కొత్త రసానుభూతిని పొందే అవకాశం లభించింది.

వేష భూషణాలతోడు : జానపద కళల ప్రదర్శన విధానాలలోని పరిణామంలో ఈ దశను పరాకాష్టగా చెప్పవచ్చు. సాధారణంగా జానపద కళలను ప్రదర్శించేపుడు, కథకుడు కథకుడు గానే ఉండటం, తాను సాధారణ ఆహార్యంతో ఉంటూనే మాటల ద్వారా, దృశ్యాలు, చిత్రాలు, కొయ్య బొమ్మలు, సంగీత వాయిద్యాల సహకారంతో ఆ కథకు సంబంధించిన సన్నివేశాన్ని, దాని తాలూకు వాతావరణాన్ని సృష్టిస్తూ వెళ్లడం అనేది సంప్రదాయంగా ఉండేది. కానీ ఈ నాలుగవ దశలో జానపద కళాకారుడు కేవలం మౌఖిక సంప్రదాయానికి, లేదా సంగీత వాయిద్య పరికరాలు ద్వారా సంగీతాన్ని సృష్టించుకుని, దానికి ఆలంబనగా బొమ్మలని చూపి, తద్వారా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి మాత్రమే పరిమితం కాకుండా ఒక అడుగు ముందుకేసి తానే ఆయా పాత్రలను పోషించే పాత్రధారిగా మారడమనేది జానపద కళాపరిణామ ప్రస్థానంలో ఉన్నతమైన దశ. ఏ పాత్ర స్వభావం ఎలా ఉందో ఆ పాత్రకు తగిన ఆహార్యం, (Costume & Makeup), (Body Language) – (Dialogue diction), భూషణాలు, ఆభరణాలు, ఆయుధాలు ధరించి ఆ పాత్రల్ని పోషించే స్థితి జానపద కళల ప్రదర్శనా విధానాల పరిణామంలో ఒక గొప్ప మలుపు.

ఈ అదనపు హంగుల వల్ల ఇక్కడ కళాకారులు తాము ధరిస్తున్న పాత్రలుగా మారిపోతారు. పాత్రకు తగిన వేషం, ఆభరణాలు, ఆయుధాలు, వస్త్రధారణ, భాష, వాచికంతో ఆ పాత్రని మన కళ్ళ ముందు సాక్షాత్కరింప చేస్తారు. కాగా సన్నివేశానికి తగిన వాతావరణాన్ని కలిగించేవిగానే చిత్రాలు, బొమ్మలు నేపధ్యంలో పరిమితం అవుతాయి తప్ప కేంద్ర స్థానంలో ఉండవు. చిత్రాల ఆధారిత కళా ప్రదర్శన స్థానంలో నటుడే, కళాకారుడే పాత్రధారిగా రావడం వల్ల చిత్రాల ప్రాధాన్యత ఈ దశలో తగ్గిపోయింది. కానీ మౌఖిక సంప్రదాయానికి సంబంధించిన పదాలు, పద్యాలు పాడటం కొనసాగింది దీంతో పాటు ప్రేక్షకులకి మరింత రక్తి కట్టడానికి వీలుగా సంగీత వాయిద్యాల తోడు కూడా కొనసాగింది. ప్రపంచం మొత్తం మీద జానపద కళల ప్రదర్శనా విధాన పరిణామం ఇలా నాలుగు దశలలో వివిధ అంశాల ప్రాతిపదికన జరిగిన విషయం సుస్పష్టం.

తెలంగాణ జానపద కళల ప్రస్థానం కూడా అందుకు మినహాయింపు కాదు అందుకే తెలంగాణలో జానపద కళల తొలి స్థానం మౌఖిక-శ్రుత సంప్రదాయానికి సంబంధించి (Oral- Auditory Tradition) మొదలై, ఆ తర్వాత సంగీత వాయిద్యాలను తోడుగా చేసుకుని ఉండే కళారూపాలు, ఆ తర్వాత చిత్రాలు, బొమ్మల ఆధారంగా, సంగీత వాయిద్యాల ప్రాతిపదికగా కథన శైలిలో మౌఖికంగా కళలను ప్రదర్శించే విధానం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత చిందు యక్షగానం బహురూపులు, వంటి కళారూపాలు పాత్రలు- పాత్రధారులు, వేష భూషణాలతో, ఆయుధాలతో, ఆహార్యంతో ప్రేక్షకులకు ఒక నవ్యమైన అనుభూతిని ఇచ్చేలాగా ఈ కళారూపాల ప్రస్థానం కొనసాగిందని తెలంగాణలోని జానపద కళల పరిణామాన్ని గమనిస్తే అర్థమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News