Thursday, May 16, 2024

గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గిరిజనుల అభ్యున్నతికి పెద్దపీట వేసింది బిఆర్‌ఎస్ ప్రభుత్వం అని దేవరకొండ శాసనసభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ట్రైకార్ ఛైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్ అన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక సాయి రమ్య ఫంక్షన్‌హాల్‌లో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గిరిజనోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా ని ర్వహించారు.

ముందుగా జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, టైకార్ ఛైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్‌తో కలిసి ఎమ్మెల్యే రవీంద్రకుమార్ జ్యోతి ప్రజ్వలనచేసి గిరిజన సాంప్రదాయ డోల్‌ను మోగించారు. అనంత రం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా అణచివేతకు, వెనుకబాటుకు గురైన గిరిజనులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త ర్వాత గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా చేసిన నాయకుడు సీఎం కెసిఆర్ అన్నారు. గిరిజనుల సంక్షేమంతోపాటు అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాల అమలుతో నేడు గిరిజనులు విద్యాధికులై ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారన్నారు.

తండాలను గ్రామపంచాయతీ గా మార్చిన ఘనత సీఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ అందించి న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు. రాజధాని న డిబొడ్డున వెలిసిన ఆత్మగౌరవం భవనాలు స్వరాష్ట్రంలో సగర్వంగా తలెత్తుకుని నిలువెత్తు ప్రతీకలు అన్నారు. గురుకులాల్లో విరబూస్తున విద్యాకుసుమాలు పారిశ్రామికవేత్తలుగా, ఉన్నతులుగా ఎదుగుతున్న సందర్భాలు ఉన్నాయన్నారు. నడుస్తున్న తెలంగాణ చరిత్రలో ఇవన్నీ సువర్ణాక్షరాలే అన్నారు.

జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న గిరిజనోత్సవం నిజంగా గిరిజన సంప్రదాయ ఉత్సవంలా జరుపుకుంటుండటం సంతోషంగా ఉందన్నారు. గిరిజనతండాలను అన్ని మౌలిక వసతులు కల్పించి నూతన గ్రా మపంచాయతీలుగా ప్రభుత్వం మార్చిందన్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. చదువుకోవడం వలన ఏమైనా సాధ్యమవుతుందని, చదువు ప్రాముఖ్యతను వి వరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో గోపిరామ్, డిటిడబ్లూఓ రాజ్‌కుమార్, ఎంపిపిలు బాణావత్మ పద్మహన్మనాయక్, మాధవరం సునితాజనార్ధన్‌రావు, జడ్పిటిసి కేతావత్ బాలునాయక్, పిఏసిఎస్ ఛైర్మన్లు ముక్కమల్ల బాలయ్య, తూం నాగార్జునరెడ్డి, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు రమావత్ దస్రూనాయక్, టివిఎన్‌రెడ్డి, దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, నేనావత్ రాంబాబునాయక్, లకా్ష్మనాయక్, వడ్త దేవేందర్‌నాయక్, నేనావత్ శ్రీనునాయక్, వాంకునావత్ బిక్కు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. గిరిజనోత్సవం సందర్భంగా గిరిజనులు పెద్ద సంఖ్యలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ట్రైబల్ వెల్పేర్ డిగ్రీ కళాశాల విద్యార్థుల నృత్యప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. గిరిజన సంప్రదాయ దుస్తుల్లో మహిళలు చేసిన గిరిజన నృత్యంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ముఖ్యఅతిథి ట్రైకార్ ఛైర్మన్ రాంచందర్‌నాయక్ ఆడిపాడి అలరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News