Sunday, May 5, 2024

ఉచిత అంబులెన్స్‌లు…

- Advertisement -
- Advertisement -

Free Ambulance services for Corona patients

కరోనా రోగులు ఉపయోగించుకోండి
సిపిలు మహేష్ భగవత్, విసి సజ్జనార్

మనతెలంగాణ, హైదరాబాద్ : కరోనా రోగుల కోసం ఉచిత అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో శనివారం ఆయన అంబులెన్స్‌లను ప్రారంభించారు. సీనియర్ సిటిజన్లు, గర్భిణుల కోసం ఉచిత అంబులెన్స్ సర్వీసులను మహేంద్ర ఎలైట్ లాజిస్ట్సి లిమిటెడ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. అత్యవసరం ఉన్న వారి కోసం రెండు వాహనాలను ప్రారంభించామని తెలిపారు. ఈ సర్వీసులు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వాహనాలను ఎప్పటికప్పుడు డిస్‌ఇన్‌ఫెక్ట్ చేస్తున్నారని తెలిపారు. అంబులెన్స్ కావాల్సిన వారు 9490617234కు ఫోన్ చేయాలని కోరారు. వృద్ధులు వెంటనే తమకు సమీపంలో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేసిన మహీంద్రా లాజిస్టిక్స్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాచకొండ ప్రతినిధులు తెలిపారు.

సైబరాబాద్‌లో కోవిడ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం…

ఉచిత అంబులెన్స్‌ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. గచ్చిబౌలిలోని కార్యాలయంలో ఉచిత అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించారు. నగరంలో అంబులెన్స్‌ల కోరత ఉందని తెలిపారు. అంబులెన్స్‌ల కోసం ప్రత్యేకంగా కోవిడ్ కంట్రోల్ రూమును ప్రారంభించారు. అంబులెన్స్ సర్వీసులను కోవిడ్, సాధారణ రోగులు ఉపయోగించుకోవాలని కోరారు. కోవిడ్ రోగులు ఆస్పత్రిలో బెడ్ కన్‌ఫార్మ్ చేసుకున్న తర్వాతే అంబులెన్స్‌కు ఫోన్ చేయాలని కోరారు. గర్భిణులు, షుగర్ రోగులు, గుండె సంబంధిత రోగులు, డయాలిసిస్, క్యాన్సర్ తదితరులు ఉపయోగించుకోవాలని అన్నారు. అంబులెన్స్ కావాల్సిన వారు 9490617431, 9490617440కు ఫోన్ చేయాలని కోరారు. కార్యక్రమంలో డిసిపిలు ఎస్‌ఎం విజయ్‌కుమార్, డిసిపిలు పద్మజా, లావణ్య, వెంకటేశ్వర్లు, కవిత తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News