Tuesday, April 30, 2024

దళారికి రాఫెల్ ముడుపులు

- Advertisement -
- Advertisement -

పారిస్: రాఫెల్ ఫైటర్స్ కొనుగోళ్లపై వాటి తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ భారత్‌లోని ఓ మధ్యవర్తికి ముడుపులు చెల్లించినట్లు ఈ నెల 4వ తేదీన ఫ్రెంచ్ మీడియా సంస్థ మీడియా పార్ట్ ఓ వార్త వెలువరించింది. ఇందులో మధ్యవర్తికి దాదాపు పది మిలియన్ యూరోలు అంటే దాదాపు రూ 8.6 కోట్లు వరకూ ఇచ్చినట్లు ఇందులో తెలిపారు. ఈ విషయాన్ని ఫ్రెంచ్ అవినీతి నిరోధక సంస్థ ఎఎఫ్‌ఎ పసికట్టిందని ఈ వార్తలో వివరించారు. ఆడిటింగ్ దశలో ఈ కీలక విషయం వెల్లడయినట్లు తెలిపారు. మరో రక్షణ ఒప్పందంలో మనీ లాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తే ఈ దళారి అని కూడా దర్యాప్తు సంస్థ పేర్కొందని వార్తా కథనంలో లెఇపారు. అయితే దీనిని రాఫెల్ సంస్థ ఖండించింది. ఫ్రాన్స్ సంస్థ నుంచి 36 రాఫెల్స్ కొనుగోలుకు రూ 59 వేల కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఇప్పటికే 14 రాఫెల్స్ భారత్‌కు చేరాయి.

French media claims of 1.1mn euros in Rafale deal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News