Friday, May 10, 2024

ఒకటే పనికి రెండుసార్లు నిధులు

- Advertisement -
- Advertisement -
సిబిఐ దర్యాప్తు జరిపించాలని బిజెపి రాష్ట్ర బాధ్యుడు తరుణ్ చుగ్ డిమాండ్

హైదరాబాద్ : ఒకే పనిని వేరువేరు పథకాల కింద చూపి, వాటికి రెండుసార్లు నిధులు రాబట్టి, స్వాహా చేయడం విస్మయానికి గురిచేస్తుందని బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర బాధ్యుడు తరుణ్ చుగ్ అన్నారు. ఇలాంటి మోసానికి పాల్పడడం దేశంలో ఇదే తొలిసారి అని తీవ్రస్థాయిలో ఆయన ఆరోపించారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టులకే అవినీతి పరిమితం కాలేదంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆరు రోడ్డు ప్రాజెక్టులలోనూ పెద్దఎత్తున అవినీతి జరిగిందన్నారు. ఒకే పనిని రెండు పథకాల కింద చూపడంతో, రెండు సార్లు విడుదలైన నిధులను స్వాహా చేసిందన్నారు. ఈ రోడ్డు ప్రాజెక్టులను రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రుణం కింద ఒకసారి, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయం కింద రెండోసారి చూసి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను బురిడీ కొట్టించిందని వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయ పథకం కింద విడుదలైన రూ.4,144 కోట్లు పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతుందన్నారు. ఈ పథకం కింద అమలు చేసినట్టు చూపించిన పనులు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రుణం ద్వారా అమలు చేసిన పనులే ఉన్నాయి. ఇది పెద్ద కుట్ర, మోసం, దీనిపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయం కింద తొమ్మిదేళ్లలో చేపట్టిన వివిధ రహదారుల పనులు, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పొందిన రుణాలు సహా అన్ని ప్రాజెక్టులపై విచారణ జరిపించాలని ఆయన కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News