Saturday, April 27, 2024

హుస్సేన్‌సాగర్‌లోనే గణేష్ నిమజ్జనం : భాగ్యనగర్ ఉత్సవ సమితి

- Advertisement -
- Advertisement -

Ganesh idol immersion in Hussain Sagar

హైదరాబాద్ : గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లోనే చేసి తీరుతామని ఉత్సవ సమితి చీఫ్ భగవంత్‌రావు వెల్లడించారు. వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి శుక్రవారం ఈ ప్రకటన చేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి మండపంలో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరులను స్మరించుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వేడుకలను సంస్కృతి సాంప్రదాయబద్దంగా నిర్వహించాలని, డిజె, సినిమా పాటలు, డాన్సులు లేకుండా ఉత్సవాలు జరపాలని కోరారు. విగ్రహాల తయారీ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం, పోలీసులు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం నిమజ్జనం ఏర్పాట్లను ఎలాంటి ఆటంకం లేకుండా చేయాలని కోరారు. మండప నిర్వహకులు ఎవ్వరికీ ఇబ్బంది జరగకుండా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News