Monday, May 6, 2024

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం రూట్ మ్యాప్

- Advertisement -
- Advertisement -
Ganesh Immersion Route Map in Hyderabad
నేటి ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 8గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలో పలు ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వినాయకుడి నిమజ్జనం కోసం విగ్రహాలు వెళ్లే రూట్‌మ్యాప్‌ను నగర సిపి అంజనీకుమార్ సోమవారం విడుదల చేశారు. నగరంలో మంగళవారం ఉదయం వినాయకుడి నిమజ్జనం ప్రారంభం కానుంది. వినాయకుడి విగ్రహాలు ఫలక్‌నూమా ట్రాఫిక్ పిఎస్ నుంచి ప్రారంభం కానుంది. అక్కడి నుంచి చార్మినార్, మదీన, అఫ్జల్ గంజ్, గౌలిగూడ, పుత్లీబౌలి, జాంబాగ్, ఎంజే మార్కెట్, అబిడ్స్ మీదుగా అప్పర్ ట్యాంక్‌బండ్‌కు రానుంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే వారు ఆర్‌పి రోడ్డు, ఎంజి రోడ్డు, కర్బాలా మైదాన్, కవాడిగూడ, ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు, ఆర్‌టిసి ఎక్స్ రోడ్డు, హిమయత్ నగర్ వై జంక్షన్ మీదుగా గాంధీ ఆస్పత్రి వరకు.

ఈస్ట్ జోన్ నుంచి వచ్చే విగ్రహాలు ఉప్పల్, రామంతాపూర్, అంబర్‌పేట్, శివం రోడ్డు, ఎన్‌సిసి ఓయూ, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రి మీదుగా నారాయణగూడ వరకు వచ్చి ఆర్టిసి ఎక్స్ రోడ్డులో కలువాలి. దిల్‌షుక్‌నగర్ నుంచి వచ్చే వాహనాలు సైదరాబాద్, చంచల్‌గూడ నుంచి నారాయణగూడ ఎక్స్ రోడ్డు వరకు, పెద్ద విగ్రహాలు అంబర్‌పేట నుంచి మూసారాంబాగ్ నుంచి తార్నాక్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. లాలాపేట వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. టోలీచౌకి, రేతిబౌలి, మెహిదిపట్నం వైపు నుంచి వచ్చే విగ్రహాలు అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ఓల్డ్ సైఫాబాద్ పిఎస్, ఇక్బాల్ మినార్ నుంచి ఎన్టీర్ మార్ట్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఎర్రగడ్డ వైపు నుంచి వచ్చే వాహనాలు ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, వివిస్టాట్యూ, ఎన్టీర్ మార్గ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.

నిమజ్జనం తర్వాత వెళ్లాల్సిన రూట్

వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసిన తర్వాత ఖాళీ వాహనాలు ఎన్టీర్ మార్గ్ నుంచి నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, వివి స్టాట్యూ, కెసిపి నుంచి వెళ్లాలి. తెలుగుతల్లి విగ్రహం, మింట్ కాంపౌండ్ వైపు వాహనాలను అనుమతించరు. అప్పర్ ట్యాంక్‌బండ్ నుంచి చిల్డ్రన్స్ పార్క్, అశోక్‌నగర్, విద్యానగర్‌నుంచి వెళ్లాల్సి ఉంటుంది.

ట్రాఫిక్ మళ్లింపు

వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వినాయకుడి విగ్రహాలు వచ్చే మార్గాల్లో సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించరు. నగర ప్రజలు, బయటి నుంచి వచ్చే వారు నగరంలోనికి రాకుండా రింగ్ రోడ్డు ద్వారా వారి గమ్యస్థానాలకు వెళ్లాలని కోరారు. నగరం నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే వారు రింగ్ రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కోరారు. అంతరాష్ట్ర లారీలు, ట్రక్కులు ఈ నెల1,2వ తేదీల్లో నగరంలోకి అనుమతించబడవు.

ఆర్‌టిసి బస్సులు

వివిధ జిల్లాలు, రాష్ట్రా నుంచి వచ్చే ఆర్‌టిసి బస్సులను దారిమళ్లించారు. ఎన్‌హెచ్ 7 నుంచి వచ్చే వాహనాలు జెబిఎస్, వైఎంసిఏ, సంగీత్ ఎక్స్ రోడ్డు, తార్నాక, జామియా ఉస్మానియా ఫ్లైఓవర్, నింబోలిఅడ్డా, చాధర్‌ఘాట్‌వైపు మళ్లించారు. బెంగళూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఆరాంఘర్ ఎక్స్ రోడ్డు, చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్డు, ఐఎస్ సదన్, నల్గొండ ఎక్స్ రోడ్డు, చాదర్‌ఘాట్ వైపు మళ్లించారు. ముంబాయి నుంచి వచ్చే వాహనాలను గోద్రేజ్ వై జంక్షన్,నర్సాపూర్ ఎక్స్ రోడ్డు, బోయిన్‌పల్లి, జెబిఎస్, వైఎంసిఏ, సంగీత్,తార్నాక, జామియా ఉస్మానియా ఫ్లైఓవర్, అడిక్‌మెట్, నింబోలిఅడ్డా వైపు వెళ్లిల్సి ఉంటుంది. ఈ ఆంక్షలు ఈ నెల 1వ తేదీ ఉదయం 6గంటల నుంచి 2వ తేదీ వరకు అమలులో ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News