Thursday, May 16, 2024

కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ కార్యదర్శితో సమావేశమైన మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

Gangula kamalakar meet with Union Food Public Distribution Secretary

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం కేంద్ర ఆహార, ప్రజాప్రంపిణి కార్యదర్శి సుదాన్షు పాండేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర కార్యదర్శికి మూడు ప్రధాన సమస్యలపై సమగ్ర వివరాలు అందించారు. ఈ యాసంగిలో పారాబాయిల్ రైస్ 50లక్షల మెట్రిక్ టన్నులు ఎఫ్‌సిఐ తీసుకొని రైతులకు మేలు చేయాలని కోరారు. గతంలో 2019..20-20 రబీలో నష్టపోయిన ముప్పై రోజులను భర్తీ చేసి మిగిలిన బియ్యాన్ని అందించడానికి మరో ముప్పై రోజుల గడువుని పెంచాలన్నారు. రాబోయే వానాకాలంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతించాలని కోరారు. గతంలో సైతం ఇదే రీతిన కొనుగోళ్ళు జరిగాయని వాటికి సంబంధించిన సమగ్ర గణాంకాలను కేంద్ర కార్యదర్శికి అందించారు. ప్రస్తుతం తెలంగాణలో మిల్లింగ్ కొనసాగుతున్నందున సత్వర పరిష్కారం కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎఫ్‌సిఐ సిఎండితో పాటు రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ అనిల్‌కుమార్‌తో ఇతర ఉన్నతాధికారులు పాల్గొని అన్ని అంశాలపై ఎఫ్‌సిఐ అధికారులకు సమగ్రంగా వివరించారు. కాగా ఎప్‌సిఐకి కావాల్సిన రిపోర్టులను అందించారు. వాటన్నింటినీ పరిశీలించిన ఉన్నతాధికారులు కేంద్ర ప్రభుత్వానికి త్వరలోనే నివేదికలు అందజేసి సమస్యలకు సత్వర పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News