Sunday, April 28, 2024

అందుకే.. చిన్న వర్షం పడ్డా వరదలు వస్తున్నాయి: మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: గత వారం రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల భారీగా వరద నీరు చేరుకున్న కరీంనగర్ టౌన్, పరిసర లోతట్టు ప్రాంతాల్లో మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం ఉదయం పర్యటించారు. పద్మానగర్, రేకుర్తి, రాంనగర్ తదితర ఏరియాల్లో రోడ్డు పనులు నడుస్తున్నందున వాటర్ నిలిచిపోయాయని, శాతవాహాన యూనివర్శిటీ వంటి కొన్ని ఓపెన్ ఏరియాల్లో వరదని 394 కాలువలోకి మళ్లించామన్నారు. నగరంలో ప్రతీ ప్రాంతంలో నిలిచిపోయిన వాననీటిని గంటన్నరలోపూ వివిద మార్గాల ద్వారా మళ్లించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుందన్నారు. మొత్తం జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, అందరూ గ్రౌండ్లోనే ఉన్నారన్నారు. మున్సిపల్ సిబ్బంది మెదలు, రెవెన్యూ, ఇరిగేషన్, వాటర్ వర్క్స్, పోలీస్ శాఖలతో సహా అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యల వల్ల ఇప్పటివరకూ ప్రాణనష్టం జరగలేదని, అక్కడక్కడ కొంత ఆస్థి నష్టం జరిగిందన్నారు. గతంలో గ్రౌండ్ వాటర్ ఎక్కువగా లేకపోవడం వల్ల వర్షాలు పడ్డప్పుడు ఆ నీరు గ్రౌండ్లోకి ఇంకిపోయి భూగర్భ జలాలుగా మారేవని, కాళేశ్వరం వల్ల గత సీజన్ నుండి అన్ని జలాశయాలు నిండు కుండల్లా మారి గ్రౌండ్ వాటర్ లెవల్ ఇప్పటికే పెరిగాయని, అందువల్ల చిన్నవర్షాలు సైతం వరదలుగా మారుతున్నాయన్నారు, వీటిని ఎక్కడికక్కడ మానేరులోకి మల్లించే విదంగా చర్యలు తీసుకుంటామన్నారు.మానేరు జలాశయం సైతం నిండి గేట్లు తెరుచుకున్నాయాన్నారు. ప్రకృతి విపత్తులు చెప్పి రావని, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందుల్ని అత్యంత త్వరగా తొలగిస్తామని, ప్రజలు సైతం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు.

Gangula Kamalakar visiting flood affected areas

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News