Sunday, May 12, 2024

పోలింగ్ ఏజెంట్ల నియామకానికి నిబంధనలు విడుదల

- Advertisement -
- Advertisement -

GHMC Polling Agents Appointment Rules Released

పొలింగ్ కేంద్రం పరిధిలోని
ఓటర్‌నే ఎజెంటుగా నియమించుకోవాలి: ఎన్నికల అధికారి లోకేష్ కుమార్

హైదరాబాద్: పొలింగ్ కేంద్రం పరిధిలో ఓటు హక్కు కలిగిన వ్యక్తులను పోలింగ్ ఎజెంట్లుగా నియమించాల్సి ఉంటుందని జిహెచ్‌ఎంసి ఎన్నికల అధికారి, కమిషనర్ డి.ఎస్‌లోకేష్ కుమార్ స్పష్టం చేశారు. పోలింగ్, కౌంటింగ్ ఎజెంట్ల నియమాకాలకు సంబంధించి జిహెచ్‌ఎంసి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పోలింగ్ బూత్‌ల వారిగా ఇద్దరి చోప్పున ఎజెంట్లను నియమించుకోవాల్సిందిగా సూచించారు.. అయితే పోలింగ్ బూత్‌లో ప్రతి అభ్యర్థి తరుపున ఒక్కరి చోప్పున మాత్రమే కూర్చోవాల్సి ఉంటుందని పేర్కొంది. మరొక్కరిని రిలీవర్‌గా వాడుకోవచ్చాని వెల్లడించింది. పోలింగ్ కేంద్రాల వారిగా నియమించే ఎజెంట్లు తప్పనిసారిగా ఆ పోలింగ్ కేంద్రంలో ఓటర్ అయి ఉండాలని స్పష్టం చేసింది.

ఒకవేళ ఎజెంట్‌గా ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ఎజెంట్లుగా నియమించుకోవాల్సి వస్తే ఇందుకు సరైన కారణాలను వివరించి రిట్నరింగ్ అధికారి నుంచి మూడు రోజుల ముందుగానే అనుమతి పోందాల్సి ఉంటుంది. అదేవిధంగా ఓట్ల లెక్కింపుకు సంబంధించి కౌంటింగ్ తేదీ నాటికి అభ్యర్థులు కనీసం 3 రోజుల ముందు తమ ఎజెంట్ల నియమాకానికి దరఖాస్తు చేసుకోవాలని జిహెచ్‌ఎంసి ఎన్నికల అధికారి, కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత పదవిలో ప్రజా ప్రతినిధులు ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా ప్రజా పరిషత్తు చైర్మన్లు, కౌన్సిలర్ మొదల్కొని రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న వారు పోలింగ్, కౌంటింగ్ ఎజెంట్లగా నియమించరాదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను అభ్యర్థులకు ఇప్పటీకే హ్యండ్ బుక్ రూపంలో అందజేయడం జరిగిందిని జిహెచ్ ఎంసి ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ తెలిపారు.

ఏజెంట్ల నియామకానికి నిబంధనలు… పోలింగ్ రోజున పాటించాల్సిన నిబంధనలు...

1. పోలింగ్ స్టేషన్ నుంచి 200 మీటర్ల దూరంలో ఎన్నికల బూతు ఏర్పాటు చేసుకోవాలి
2. టేబుల్, రెండు కుర్చీలు ఇద్దరు వ్యక్తులకు సరియే విధంగా గొడుగు, టార్పాలిన్ ఉపయోగించుకోవచ్చు.
3. అభ్యర్తి పేరు, పార్టీ పేరు, ఎన్నికల చిహ్నం కలిగిన( మూడు x నాలుగున్నర అడుగుల) బ్యానర్ కట్టుకోవచ్చు.
4. బూత్‌ల ఏర్పాటుకు స్థానిక అధికారుల నుంచి వాత్రపూర్వకంగా అనమతి పొందాల్సి ఉంటుంది.
5. అనుమతి పత్రాన్ని పోలీసులు, ఎన్నికల అధికారులు అడిగిన వెంటనే చూపించాల్సి ఉంటుంది.
6. పోలింగ్ రోజున పోలింగ్ బూత్‌కు 100 మీటర్ల పరిధిలో ఏలాంటి ప్రచారం నిర్వహించరాదు.
7. పొలింగ్ స్టేషన్ లోపల దాని పరిసర ప్రాంతమైన 100 మీటర్ల పరిధిలో మొబల్ పోన్లు, కార్డెన్ పోన్లు, వైర్లెస్ సెట్లు మొదలైనవి కలిగి ఉండరాదు.
8. కేవలం ఎన్నికల పరిశీలకులు, సూక్ష్మ పరిశీలకులు, ప్రిసైడింగ్ అధికారి, రిటర్నింగ్ అధికారి భద్ర సిబ్బందికి మాత్రమే పోన్లు అనుమతి.
9. పోలింగ్ రోజున అభ్యర్థిని తన వార్డు పరిధిలో తిరగడానికి కేవలం ఒక వాహనాన్ని మాత్రమే అనుమతించబడుతుంది.
10. అభ్యర్థికి కేటాయించిన వాహనాన్ని ఏ ఇతర అభ్యర్థి ఉపయోగించడానికి అనుమతించబడదు.
11. పోలింగ్ రోజున ఓటర్లను ప్రత్యేక్షంగాని, పరోక్షంగా వాహనాల ద్వారా పోలింగ్ స్టేషన్లకు తీసుకురావడం నేరంగా పరిగణించబడుతుంది.

GHMC Polling Agents Appointment Rules Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News