Saturday, April 20, 2024

రాజాసింగ్ శ్రీరామ నవమి ఊరేగింపులో గాడ్సే ఫోటో(వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో గురువారం జరిగిన శోభాయాత్రలో మహాత్మా గాంధీ హంతకుడు నాతూరాం గాడ్సే చిత్రపటం దర్శనమివ్వడం వివాదాస్పదమైంది. సస్సెన్షన్‌కు గురైన బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తన అనుచరులతో కలసి మంగళ్‌హాట్ వద్ద ప్రధాన యాత్రలో పాల్గొన్నపుడు ఆయన అనుచరులు గాడ్సే ఫోటోను ఊరేగింపులో ప్రదర్శించారు.

ఆసిఫ్ నగర్ సమీపంలోని సీతారాంబాగ్ ఆలయం వద్ద శ్రీరామ నవమి శోభాయాత్ర ప్రారంభమైంది. కొన్ని వందల మంది సభ్యులతో ప్రారంభమైన యాత్ర మంగళ్‌హాట్ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకునేసరికి భారీ ఊరేగింపుగా మారిపోయింది. రాజా సింగ్ సారథ్యంలో శ్రీరాం యువ సేన ఆధ్వర్యంలో మరో ఊరేగింపు ప్రధాన శోభాయాత్రలో చేరింది. రాజా సింగ్ అనుచరులు ఈ యాత్రలో ప్రస్తుతం హిందూత్వవాదులకు ఆరాధ్యునిగా మారిపోయిన నాథూరాం గాడ్సే చిత్రపటాన్ని చేతిలో పట్టుకుని పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News