Sunday, May 5, 2024

బంగారం దిగొస్తోంది..

- Advertisement -
- Advertisement -
Gold rates today fall further
ఒక్క రోజే రూ.992 తగ్గిన ధర

ముంబై : కొద్ది రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధర మళ్లీ దిగొస్తోంది. గురువారం ఒక్క రోజు పసిడి ధర రూ.992, వెండి ధర రూ.1,949 తగ్గింది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం, రూపాయి విలువ పెరగడంతో పాటు అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు క్షీణించడంతో ఆ ప్రభావం భారతదేశంపై కనిపించింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.992 పెరిగి రూ.52,635కు చేరింది. అంతకుముందు బుధవారం 10 గ్రాముల రేటు రూ.53,627గా ఉంది. వెండి కిలో ధర రూ.1,949 పెరిగి రూ.69,458కు చేరగా, బుధవారం ఈ రేటు రూ.71,407గా ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 20 పైసలు పెరిగి 76.42కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్ 1,983 డాలర్లకు తగ్గింది. ఇక వెండి ఔన్స్ 25.50 డాలర్లకు పడిపోయింది. కామెక్స్‌లో గోల్డ్ ట్రేడ్ బలహీనంగా 0.30 శాతం క్షీణతతో 1,983 డాలర్లకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News