Sunday, May 5, 2024

పరిసరాల పరిశుభ్రతతోనే మంచి ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: పరిసరాల పరిశుభ్రతతోనే మంచి ఆరోగ్యంతోనే లభిస్తుందని జిఎం బళ్ళారి శ్రీనివాసరావు అన్నారు. భూపాలపల్లి ఏరియా స్థానిక జిఎం కార్యాలయంలో స్వచ్ఛతా పక్వాడలో భాగంగా సంచుల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ బళ్లారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై జిఎం కార్యాలయం అధికారులకు, సిబ్బందికి నార సంచులను పంపిణీ చేశారు. భారత కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఆదేశానుసారం డైరెక్టర్ జనరల్ సూచనలను అనుసరించి సింగరేణి వ్యాప్తంగా స్వచ్చతా పక్వాడ..2023 అనే నినాదంతో స్వచ్చ్ భారత్ పరిశుభ్రత పక్షోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

పరిశుభ్రతమైన గాలి, నీరు, పారిశుధ్యం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుట, ప్లాస్టిక్ నిర్మూలన తదితర కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగా భూపాలపల్లి ఏరియా జిఎం కార్యాలయం నందు జిఎం బళ్ళారి శ్రీనివాసరావు చేతుల మీదుగా జూట్ బ్యాగుల పంపిణీ నిర్వహించబడిందన్నారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ స్వచ్ఛత పఖ్వాడ 2023 ఒక గొప్ప కార్యక్రమమని స్వచ్ఛమైన భారతదేశం నిర్మాణంలో స్వచ్చతా పక్షోత్సవాలు ముఖ్య భూమికను పోషిస్తుందని, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులకు, జిఎం ఆఫీస్ సిబ్బందికి జనపనార బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News