Thursday, May 9, 2024

బిసి బంధు పథకాన్ని అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -

జడ్చర్ల : బిసి బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని బిసి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి కృష్ణయాదవ్ డిమాండ్ చేశారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ తిరుపతయ్యకు మెమోరాండం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం బిసి బంధు పథకాన్ని అమలు చేస్తామని హామీనిచ్చారని గుర్తు చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బిసి బంధు పథకాన్ని అమలు పర్చి రాష్ట్రంలోని ప్రతి బిసి కుటుంబానికి 100 శాతం రాయితీతో రూ. 10 లక్షలు ఇచ్చి ఉపాధి చూపాలని ఆయన కోరారు.

బిసి సామాజిక వర్గంలోని అతి కొన్ని బిసి కులాలకే కుల వృత్తుల నిర్వహణ కోసం లక్ష రూపాయల సహయం చేయడం అన్యాయమని రాష్ట్రంలోని అన్ని బిసి కుటుంబాలకు లక్ష ఆర్థిక సహయం వర్తింపజేయాలన్నారు.బిసి కార్పొరేషన్ , బిసి ఫెడరేషన్ ద్వారా రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికి రాయితీ రుణాలు ఇచ్చి బిసిల సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొల్లెమోని నిరంజన్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి లింగంపేట్ శేఖర్ , కార్మిక విభాగం, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురభి విజయ్‌కుమార్, జిల్లా నాయకులు గోపాల్, కార్మిక విభాగం మండల అధ్యక్షులు ఆకుల చంద్రమౌళి, మండల కార్యదర్శి సురభీ రఘు, కట్ట మురళి , టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాం, రమేష్ , సురభి ఆంజనేయులు, ఆలూర్ నర్సిములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News