Friday, May 3, 2024

Good News: హెచ్1బి వీసాదారులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : హెచ్-1 బి వీసాదారులకు అమెరికా శుభవార్త చెప్పింది. ఇకపై హెచ్-1 బి వీసాదారులు కెనడాలోనూ పనిచేయవచ్చని ప్రకటించింది. యూఎస్ హెచ్-1బి వీసాదారులు 10వేల మందికి కెనడాలో ఓపెన్ వర్క్ పర్మిట్ స్ట్రీమ్‌ను ప్రారంభించింది. అమెరికాలో ఉన్న 75 శాతం భారత హెచ్-1 బి వీసాదారులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ వీసా కలిగిన 10వేల మంది దరఖాస్తులను కెనడా ప్రభుత్వం స్వీకరించనుంది. యూఎస్ వీసాదారుల్లో ఉన్న సాంకేతిక ప్రతిభను తమవైపు ఆకర్షించడానికి కెనడా ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది.

అత్యంత ప్రతిభా నైపుణ్యం ఉన్న కార్మికులను ఆకర్షించడానికి యూఎస్ నుంచి హెచ్-1బి వీసా హోల్డర్లకు కెనడా ఓపెన్ వర్క్ పర్మిట్లను ఇవ్వడం ప్రారంభించింది. యూఎస్ వీసా ఉన్న వారు మూడు సంవత్సరాల పాటు కెనడాలో పనిచెయ్యవచ్చు. 2023 వసంవత్సరం జులై 16వ తేదీ నాటికి హెచ్1 బి వీసా హోల్డర్‌లు, వారితో పాటు ఉన్న కుటుంబ సభ్యులు కెనడాకు రావడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని కెనడియన్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా యూఎస్ వీసాదారులు కెనడాలో ఎక్కడైనా పనిచేసుకునేందుకు వీలుగా తాత్కాలిక నివాస వీసా ఇస్తారు.భారతదేశం, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం పదివేల మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగులను టెక్నాలజీ కంపెనీలు నియమించుకుంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News