Friday, May 3, 2024

టిసిఎస్ ఉద్యోగులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఆర్థిక మాంద్యం నేపథ్యంలో దిగ్గజ సంస్థలు ఉద్యోగుల తొలగింపును కొనసాగిస్తున్నాయి. హూరుకమంలో టిసిఎస్ కూడా తమ సంస్థలోని ఉద్యోగులను తొలగించనుందనే నివేదికలు వెలువడ్డాయి. అయితే లేఆఫ్స్ నివేదికలను టిసిఎస్ ఖండించింది. తమ సంస్థలో ఉద్యోగులను తొలగించడం లేదని స్పష్టం చేసింది. టిసిఎస్ చీఫ్ హెచ్‌ఆర్ అధికారి మిలింద్ మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థలోని ఉద్యోగుల ప్రతిభను పెంపొందిస్తామని ఉద్యోగులను తొలగించమని స్పష్టం చేశారు.

తమ సంస్థలో ఉద్యోగుల ప్రొడక్టివిటీ గురించి మాత్రమే ఆలోచిస్తామని లేఆఫ్స్‌పై కాదని వెల్లడించారు. ప్రస్తుతం టిసిఎస్‌లో 6లక్షల మంది విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులకు ప్రతి ఏటా పెంచినట్లే శాలరీలు ఈ ఏడాది పెంచుతామని మిలింద్ తెలిపారు. కాగా ఉద్యోగం కోల్పోయినవారిని టిసిఎస్‌లో చేర్చుకోవాలనే ప్రణాళిక ఉందని తెలిపారు. యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైన్, ఎఐ, ప్రొడక్ట్ ఎక్స్‌పీరియన్స్ విభాగాల్లో నిపుణులైన ఉద్యోగుల కోసం మిలింద్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News