Sunday, April 28, 2024

గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

ధర్మారం: మండలంలోని పలు గ్రామాల్లో గిరిజనుల ఆరాధ్య దైవమైన శీతల భవాని ఉత్సవాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్నేహలత దంపతులు పాల్గొన్నారు. కొత్తూరు బంజరుపల్లి తండా, కొత్తపల్లి గ్రామాల్లో గిరిజనులు ప్రతి ఏటా సాంప్రదాయ బద్దంగా నిర్వహించే శీతల భవాని ఉత్సవాల కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వర్షంలో కూడా మంత్రి దంపతులు పాల్గొన్నారు. సాంప్రదాయ నృత్యాలతు, తమ వేషాధారణలతో లంబాడీలు మంత్రి దంపతులకు స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో ప్రత్యేక పూజల అనంతరం మంత్రి దంపతులను ఘనంగా సన్మానించారు. గిరిజనుల కోసం వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.తొలిసారిగా గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇవ్వడంతో పాటు వెంటనే రైతు బందు ప్రవేశ పెట్టడం, రిజర్వేషన్లు కల్పించడం సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. ప్రతి గిరిజన బిడ్డ సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ బలరాంరెడ్డి దంపతులు,మార్కెట్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, జిల్లా రైతుబంధు సభ్యులు పూసుకూరు రామారావు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాచూరు శ్రీధర్, మండల అధికార ప్రతినిధి గుర్రం మోహన్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మిట్ట తిరుపతి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు బానోతు రాజేశ్వరి, రవి నాయక్, కొత్తూరు గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనునాయక్, గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News