Wednesday, May 8, 2024

రాష్ట్రం మారినా రీ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు

- Advertisement -
- Advertisement -
Govt introduces new registration series for vehicles
వ్యక్తిగత వాహనాలకు ‘బిహెచ్’ సిరీస్‌ను ప్రవేశపెట్టిన కేంద్రం

న్యూఢిల్లీ: వాహన రిజిస్ట్ట్రేషన్‌కు సంబంధించి కేంద్రం శుభవార్త తెలిపింది. ఉద్యోగ రీత్యా వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు తమ వ్యక్తిగత వాహనాలకు మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేకుండా ‘ బిహెచ్’(రిజిస్ట్రేషన్) భారత్ రిజిస్ట్రేషన్) రిజిస్ట్రేషన్ సిరీస్‌ను తీసుకు వచ్చింది. ఈ విధానం కింద వ్యక్తిగత వాహనదారులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం తప్పుతుంది. ఈ మేకు తాజాగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేంద్ర భద్రతా బలగాలు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు చెందిన ఉద్యోగులు, ప్రైవేటు కంపెనీలు/సంస్థల ఉద్యోగులు(ఆయా కంపెనీలు నాలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తుండాలి) ఈ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని స్వచ్ఛందంగా ఉపయోగించుకోవచ్చని కేంద్రం తెలిపింది.

దీంతో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికైనా తమ వాహనాలను సులువుగా తీసుకెళ్లేందుకు వీలు పడుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఒక రాష్ట్రంలో రిజిస్టర్ చేయించిన వాహనాన్ని గరిష్టంగా 12 నెలలు మాత్రమే వేరే రాష్ట్రంలో ఉపయోగించుకునే వీలుంది. ఒక వేళ అంతకంటే ఎక్కువ కాలం పాటు అక్కడ వాహనం నడపాలంటే వాహనాన్ని గడువులోగా మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం బిహెచ్ సిరీస్‌ను తీసుకువచ్చింది. కేంద్రం ఈ నెల 26న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం రూ.10 లక్షల వరకు ధర ఉండే బిహెచ్ సిరీస్ నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాలకు రిజిస్ట్రేషన్ సమయంలో 8 శాతం పన్ను ఉంటుంది. అదే రూ.1020లోపు వాహనాలకు 10 శాతం, రూ. 20 లక్షలకు పైగా ధర ఉండే వాహనాలకు 12 శాతం పన్ను ఉంటుంది. డీజిల్ వాహనాలకైతే 2 శాతం ఎక్కువ, ఎలక్ట్రిక్ వాహనాలయితే 2 శాతం తక్కువ చార్జి వసూలు చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News