Wednesday, May 29, 2024

అన్ కండిషనల్ లవ్ ఎలా ఉంటుందో చూస్తారు

- Advertisement -
- Advertisement -

Heroine Megha akash interview

 

తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న భామ మేఘా ఆకాష్. ఆమె నటించిన సినిమా ‘డియర్ మేఘ’ సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల హీరోలుగా నటించారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్ బ్యానర్‌పై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సుశాంత్ రెడ్డి రూపొందించారు. హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో చిత్ర నాయిక మేఘా ఆకాష్ మాట్లాడుతూ “ఇటీవల ‘రాజ రాజ చోర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాను. ఇప్పుడు నా మరో సినిమా ‘డియర్ మేఘ’ విడుదలకు సిద్ధమవడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు సుశాంత్ రెడ్డి ‘డియర్ మేఘ’ కథ చెప్పిప్పుడు చాలా రొమాంటిక్, ఎమోషనల్, లవబుల్ ఫిల్మ్ అనే ఫీల్ కలిగింది.

ఇలాంటి కథలో నటించాలి అనేది నా డ్రీమ్. అందుకే వెంటనే ఒప్పుకున్నాను. డియర్ మేఘ సినిమాలో అన్ కండిషనల్ లవ్ అంటే ఎలా ఉంటుందో చూస్తారు. మా చిత్రంలో జెన్యూన్ లవ్‌ను ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరి అనుకోవచ్చు. – ఈ సినిమాలోని పాటలన్నీ ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయి. ఇక ప్రస్తుతం స్క్రిప్టులు వింటున్నాను. గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తున్నాను. మరికొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News