Monday, April 29, 2024

ఓటీటీలో ‘మాస్ట్రో’ విడుదల ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

Maestro to stream on OTT, release date fixed

నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ట్రో’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ బ్లాక్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపొందుతోంది. ఇది నితిన్ కెరీర్‌లో 30వ చిత్రం. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘మాస్ట్రో’ చిత్రాన్ని సెప్టెంబర్ 17 నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కి పెడుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. డిస్నీ హాట్ స్టార్‌లో డైరెక్ట్ ఓటీటీలో విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా ఇది. ఈ సందర్భంగా సినిమాలోని ప్రధాన తారాగణం అంతా ఉన్న ఓ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. కాగా హిందీ బ్లాక్‌బస్టర్ హిట్ ‘అంధాదున్’ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్ ’మాస్ట్రో’. ఇందులో నితిన్ అంధుడిగా కనిపించనున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్రలో కనిపించనుంది. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి – నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News