Monday, April 29, 2024

ఐసిస్‌పై అమెరికా ‘డ్రోన్ దాడి’

- Advertisement -
- Advertisement -

 

US drone strike on ISIS-K

ఐసిస్ ముఖ్యుల్లో ఇద్దరు హతం
నెలాఖరులోగా ఐసిస్‌ను తుడిచిపెట్టాలని అమెరికా దీక్ష హతులు
గురువారం నాటి కాబూల్ ఎయిర్‌పోర్టుపై దాడి సూత్రధారులో కాదో దర్యాప్తు

వాషింగ్టన్ /కాబూల్ : కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద ఇటీవలి ఐఎస్‌ఐఎస్ కె జరిపిన ఉగ్రదాడికి అమెరికా సైన్యం శనివారం ప్రతిచర్యకు దిగింది. దేశంలోని నంగర్‌హార్ ప్రావిన్స్‌లో అమెరికా సైనిక డ్రోన్ జరిపిన దాడిలో ఐసిస్ వ్యూహకర్త ఒకరు హతులు అయ్యారు. ఈ విషయాన్ని శనివారం అమెరికాసైనిక కేంద్రీయ దళాల ప్రతినిధి క్యాప్టెన్ బిల్ అర్బన్ తెలిపారు. అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన క్రమపు దశలో ఇస్లామిక్ స్టేట్ దేశీయ సంస్థగా పేర్కొంటూ ఐఎస్‌ఐఎస్ కె ఉనికిలోకి వచ్చింది. అమెరికన్లను దెబ్బతీసేందుకు కాబూల్ వద్ద ఉగ్ర ఆత్మహుతి దాడికి దిగిందని తామేనని ఈ సంస్థ ప్రకటించుకుంది. కాబూల్‌లో జరిగిన రెండు పేలుళ్లు, ఈ ఘటనలలో అమెరికా సైనికులు బలి కావడంపై ప్రెసిడెంట్ బైడెన్ తీవ్రస్థాయిలో స్పందించారు. తమ జోలికి వచ్చిన వారిని వదిలేది లేదని ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. మరుసటిరోజు అమెరికా డ్రోన్‌తో వీరిపై దాడి జరిగింది.

తమ దేశ సేనలు గగనతల ఉగ్రవాద నిరోధక చర్యలకు దిగాయని , ఐఎస్‌ఐఎస్ కె ప్లానర్‌పై దాడి జరిగిందని అధికార ప్రతినిధి వివరించారు. లక్షంగా ఎంచుకున్న ప్లానర్‌పైనే దాడి జరిగింది. ఇది విజయవంతం అయిందని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని క్యాప్టెన్ బిల్ అర్బన్ వెల్లడించారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా వేటాడి వారిపని పట్టడం జరుగుతుందని బైడెన్ శపథం వహించారు. ఇందుకు అనుగుణంగానే అమెరికా బలగాలు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ శత్రువుపై విరుచుకుపడుతున్నాయి. ఈ నెల చివరికి దేశం నుంచి అమెరికా సేనలు ఉసంహరణ గడువు ఉండటంతో అప్పటిలోగా ఐసిస్ అవశేషాలను తుదముట్టించాలని అమెరికా అధ్యక్షులు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా దేశంలో మారుమూల ప్రాంతాలలోకి వైమానిక దాడులను తీవ్రతరం చేయాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కాబూల్‌లో ఎవరు దాడి జరిపినా. అమెరికాకు ఎవరు హాని తలపెట్టినా , తాము క్షమించే ప్రసక్తే లేదని, వారెక్కడ ఉన్నా వెతికి వేటాడి మూల్యం చెల్లించుకునేలా చేస్తామని, దేశ ప్రయోజనాలు, ప్రజా భద్రత వారి క్షేమం కోసం తీవ్రస్థాయిలో స్పందిస్తూ ఉంటామని, ఈ కోణంలో తమ ప్రతి ఆదేశం కార్యాచరణతో సాగుతుందని బైడెన్ తెలిపారు.

ఇప్పుడు అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో హతుడయినట్లు చెపుతున్న ఐసిస్ కె ప్లానర్ కాబూల్‌లో గురువారం నాటి ఉగ్రదాడికి పాల్పడ్డ వ్యక్తేనా అనే విషయాన్ని వైట్‌హౌస్ వర్గాలు పూర్తిస్థాయిలో నిర్థారించలేదు. గురువారం ఉగ్రవాదుల దాడిలో దాదాపు 200 మంది వరకూ దుర్మరణం చెందారు. వీరిలో 13 మంది వరకూ అమెరికా సైనికులు ఉండటంతో బైడెన్ తీవ్ర కలత చెందారు. తాలిబన్లు ఓ వైపు దూకుడుగా వ్యవహరిస్తూ ఉండటం, మరో వైపు వారికి తోడుగా అన్నట్లు అమెరికాకు అత్యంత ప్రమాదకరమైన ఐసిస్ వర్గాలు తమ ఉనికిని బలోపేతం చేసుకునే దిశలో స్థానికంగా ఐసిస్ వర్గాల పేరుతో బలం పెంచుకుంటూ ఉండటంతో ఎప్పుడైనా పేలుళ్లు జరగవచ్చుననే అంచనాలు వెలువడుతున్నాయి.

కొండలు లోయ ప్రాంతాలను స్థావరాలుగా చేసుకుని ఉన్న ఐసిస్ వర్గాలు మెరుపుదాడులు, అంతకు మించి మరింత ప్రమాదకరంగా ఆత్మాహుతి దాడులకు దిగే ముప్పు ఉండటంతో వీరిని దెబ్బతీసేందుకు డ్రోన్ల దాడికి బైడెన్ సైనికాధికారులకు అనుమతిని ఇచ్చారు. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కూడా ఈ కోణంలో మరిన్ని దాడులు చేపట్టడం ద్వారా కాబూల్ ఇతర చోట్ల ఐసిస్ లేదా ఇతర బృందాల దాడులను నివారించాలని ఆదేశాలు వెలువరించారు. దీనిని ప్రాతిపదికగా చేసుకుని అమెరికా సేనలు అఫ్ఘన్‌లో కీలక ఇంటలిజెన్స్ సమాచారం మేరకు స్పందిస్తూ వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News