Friday, June 9, 2023

టిఎస్ ఆర్టీసి బస్సు ఢీకొని తాత,మనవరాలు మృతి

- Advertisement -
- Advertisement -

రేగొండ: టిఎస్ ఆర్టీసి బస్సు ఢీకొని తాత,మనవరాలు మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ములుగు గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బుక్కయ్య తన చిన్న కూతురును బైక్ పై కోటంచకు తీసుకెళ్తుండగా భూపాలపల్లి నుంచి

హనుమకొండకు వెళ్తున్న ఆర్టీసి బస్సు రేగొండ మండలం బాగిర్తిపేట క్రాస్ రోడ్డు వద్ద ఢీకొట్టింది. ఈ ఘటనలో తాత మనవరాలు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News