Wednesday, May 15, 2024

తెలంగాణ ఉద్యమకారులకు ఘనంగా సత్కారం

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తాలో తెలం గాణ ఉద్యమకారులకు గురువారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ముఠా జైసింహ ఆధ్వర్యం లో నిర్వహించిన ఈ సభలో ఆనాటి తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేసిన గురుచరణ్ సింగ్, గజ్జల సూర్యానారాయణ, మాధవ్, రోశం బాలు, అజయ్ ముదిరాజ్, కొండా శ్రీధర్ రెడ్డి, ముదిగొండ మురళి, బాలరాజు గౌడ్, ఆర్. శ్రీను తదితరులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో రథసారథులుగా పనిచేసిన ఉద్యమకారులు ప్రజలను చైతన్యం చేయడంలో అత్యంత కీలకంగా పనిచేశారన్నారు.

ఉద్యమకారుల కారణంగానే ప్రజలు తమ చైతన్యాన్ని ప్రదర్శించి ఉమ్మడి పాలకులను గడగడలా డించారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలంగా పనిచేసిన కళాకారులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతోందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో అనేక మంది ఉద్యమకారులు వివిధ హోదాలలో ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారం అవుతోందని, జల యుద్దాలు వస్తా యని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యాకా.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రె స్ పార్టీ నాయకులు చెప్పివన్నీ అబద్దాలని తేలిపోయిందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు, దళిత బంధు, బిసీల్లో కుల వృత్తులకు లక్ష రూపాయల పథకం, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ తదితర పథకాలతో సంక్షేమ రాష్ట్రంగా దేశంలో ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిన ట్టు తెలిపారు. అనంతరం రాంనగర్ చౌరస్తా నుంచి అమరువీరుల స్మారక దీపం ఆవిష్కరణకు బీఆర్‌ఎస్ కార్యకర్తలతో బైక్ ర్యాలీగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువ నాయకులు ముఠా జైసింహ తరలి వెళ్లారు. రావులపాటి మోజస్, మన్నె దామోదర్ రెడ్డి, కొండా శ్రీధర్ రెడ్డి, వల్లాల శ్యామ్ యాదవ్, బల్ల శ్రీనివాస్ రెడ్డి, వై.శ్రీనివా స్, రాకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News