Friday, May 3, 2024

జిఎస్‌టి పరిహారం ఐదేళ్లు పొడిగించండి

- Advertisement -
- Advertisement -
GST compensation Extended by five years
జిఎస్‌టి పరిహారం ఐదేళ్లు పొడిగించండి
పరిహారం పెంచకపోతే ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది
ప్రిబడ్జెట్ సమావేశంలో రాష్ట్రాలు

న్యూఢిల్లీ : మరో ఐదేళ్ల పాటు జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) పరిహారాన్ని పొడిగించాలని అనేక రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. గురువారం వివిధ రాష్ట్రాల ఆర్థికమంత్రులతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రీ-బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్రాలు కరోనా మహమ్మారి కారణంగా ఆదాయంపై ప్రభావం పడిందని, జిఎస్‌టి నుంచి ఎక్కువ పరిహారం ఇవ్వాలని కోరాయి. జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను)లో స్థానిక పన్ను వ్యాట్ నుంచి ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు కేంద్రం పరిహారం అందజేస్తోంది. ఈ జిఎస్‌టి పరిహారం గడువు 2022 జూన్ నాటికి ముగియనుంది. దీంతో మరో ఐదేళ్లు పొడిగించాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.

జిఎస్‌టి వ్యవస్థ వల్ల రాష్ట్రాలకు ఆదాయంలో నష్టం వస్తోందని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ అన్నారు. వచ్చే ఏడాదిలోనూ తన రాష్ట్రానికి రూ.5000 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందువల్ల 2022 జూన్ తర్వాత కూడా మరో ఐదేళ్ల పాటు జిఎస్‌టి పరిహారం కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ, పరిహారం పొడిగించకపోతే అనేక రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దిగజారే అవకాశముందని అన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను పెంచాలని, ఢిల్లీకి కేంద్రం పన్ను కంటే ఎక్కువ డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక రాష్ట్రాలు కూడా జిఎస్‌టి పరిహారం పొడిగించాలనే డిమాండ్ చేశాయి. ఈ సమావేశంలో సాధారణ బడ్జెట్‌కు సంబంధించి రాష్ట్రాల అంచనాలు, సూచనలను ఆర్థిక మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ సమావేశం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News