Monday, April 29, 2024

యువతి స్వీయ వివాహం

- Advertisement -
- Advertisement -

తనను తాను పెళ్లాడనున్న గుజరాత్ యువతి
దేశంలోనే తొలి సోలోగమీ కేసుగా రికార్డు
ఇలాంటి పెళ్లికి చట్టబద్ధత లేదంటున్న న్యాయ నిపుణులు
అహ్మదాబాద్: పెళ్లంటే మూడు ముళ్లు.. ఏడడుగుల బంధమే కాదు, భార్యాభర్తలు కష్టసుఖాల్లో కలిసి వందేళ్లు సాగించే సుదీర్ఘ ప్రయాణం. అయితే ఇందుకు భిన్నంగా ఓ యువతి తనను తానే పెళ్లాడనుంది. ఆమే గుజరాత్‌లోని వడోదరకు చెందిన 24 ఏళ్ల క్షమాబిందు. మంత్రాలు, ఏడడుగులు, సింధూరధారణ వంటి పెళ్లి కార్యకమాలు మొదలుకొని హనీమూన్ వరకు అన్నీ ప్లాన్ చేసుకోవడం విశేషం. జూన్ 11న ఇందుకు ముహూర్తం కుదిరింది. కాగా దేశంలోనే ఇది మొట్టమొదటి స్వీయ వివాహం(సోలోగమీ) కానుంది. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే క్షమా ఈ విషయమై మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. కానీ పెళ్లికూతుర్ని కావాలనుకు న్నా. కాబట్టి నన్ను నేనే వివాహం చేసుకోవాలనుకున్నా’ అని తెలిపిం ది. ‘దేశంలో ఇలాంటి పెళ్లి ఎక్కడైనా జరిగిందా అని వెతికా.. కానీ ఎక్కడా కనిపించలేదు. బహుశా మొదటి వ్యక్తిని నేనే కావచ్చు’ అని తెలిపింది. కొందరు స్వీయ వివాహాన్ని అసంబద్ధమైనదిగా భావించవచ్చు కానీ ‘ మహిళలూ ముఖ్యమే’ననే విషయాన్ని చాటి చెప్పడానికి తాను ప్రయత్నిస్తున్నాని తెలిపింది.

ఈ విషయంలో తల్లిదండ్రులూ తనను ఆశీర్వదించారని, గోత్రిలోని ఓ ఆలయంలో వివాహ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం గోవాకు వెళుతున్నట్లు తెలిపింది. గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమాబిందు తనను తాను పెళ్లాడాలనుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకోసం ఆమె లెహంగాను సైతం ఆర్డర్ చేయడంతో పాటు వెడ్డింగ్ కార్డులను కూడా పంచిపెట్టారు. సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ చేసిన క్షమా ప్రస్తుతం ఓ ప్రైవేటు కంపెనీలో సీనియర్ రిక్రూట్‌మెంట్ ఆఫీపర్‌గా పని చేస్తున్నారు. ఆమె తల్లిదండ్రులిద్దరూ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. తండ్రి దక్షిణాఫ్రికాలో ఉండగా తల్లి గుజరాత్‌లో ఉన్నారు.తన కూతురు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి వారికి కొంత సమయం పట్టినప్పటికీ కానీ చివరికి కూతురు ఇష్టానికి అంగీకరించారు. ఆఖరుకు ఈ వివాహం జరిపించేందుకు పూజారిని కూడా ఒప్పించారు. ఈ నెల 11న స్నేహితుల సమక్షంలో జరిగే ఈ వివాహంలో వారు వీడియోకాల్‌ద్వారా పాల్గొననున్నారు.అయితే దేశంలో ఈ స్వీయ వివాహం( సోలోగమీ)కి చట్టపరంగా ఎలాంటి మద్దతు లేదని న్యాయ నిపుణులు అంటున్నారు.‘ భారత చట్టాల ప్రకారం ఒక వ్యక్తి తనను తాను వివాహం చేసుకోవడానికి వీలు లేదు. పెళ్లిలో ఇద్దరు వ్యక్తులు(వరుడు, వధువు) ఉంటారు. సోలోగమీ చట్టబద్ధం కాదు’ అని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ క్రిష్ణకాంత్ వఖారియా అన్నారు. పలువురు న్యాయ నిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Gujarat Girl to get engaged herself

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News