Tuesday, May 7, 2024

మేకింగ్ స్టైలే వేరు

- Advertisement -
- Advertisement -

 

తొలి చిత్రం ‘లాఠీ’ నుంచి ‘రుద్రమదేవి’ వరకు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ మేకింగ్ స్టైలే వేరు. అదే ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. తొలి చిత్రం ‘లాఠీ’ మూడు నంది అవార్డులను సొంతం చేసుకోవడంతో గుణశేఖర్ అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆ తర్వాత ‘సొగసుచూడతరమా’ అనే సెన్సిబుల్ మూవీతో ఆకట్టుకున్నారు. ఈ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో మరోసారి నంది అవార్డును దక్కించుకుంది. ఇక మూడో చిత్రం ‘బాలరామాయణం’. నేటి తరం అగ్ర కథానాయకుల్లో ఒకరైన తారక్ బాలనటుడిగా నటించిన తొలి చిత్రమిది. ఈ సినిమా బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం కేటగిరీలో జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకుంది. ఇలా మూడు చిత్రాలతో దర్శకుడిగా తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు గుణశేఖర్. సినిమాపై ఉన్న ప్యాషన్‌తో తను చేసే ప్రతి సినిమాను అద్భుతంగా మలుస్తూ ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలతో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోన్న ఈ మూవీ మేకర్ బుధవారం తన పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఇక తెలుగు సినిమా పరిశ్రమలో పౌరాణిక, కమర్షియల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ ఆదిపర్వంలోని ఆహ్లాదకరమైన ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘శాకుంతలం’. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో డిఆర్‌పి -గుణా టీమ్ వర్క్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని శకుంతలగా టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాను గుణశేఖర్ ఏ మాత్రం రాజీపడకుండా రూపొందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News