Monday, May 13, 2024

గ్యాంగ్‌స్టర్‌గా ధనుష్

- Advertisement -
- Advertisement -

Heroine Madonna warning to Hero Dhanush in Kollywood

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, – డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘జగమే తంతిరమ్’. ధనుష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగులో ‘జగమే తంత్రం’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూసిన మేకర్స్.. చివరకు కోవిడ్ నేపథ్యంలో డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేయబడిన ప్రచార చిత్రాలు, – టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ‘జగమే తంత్రం’ తెలుగు ట్రైలర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ట్రైలర్‌లో ధనుష్‌ని తమిళనాడుకు చెందిన ‘సురలి’ అనే ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్‌గా చూపించారు. లండన్‌లో అక్రమ ఆయుధాలు, బంగారు వ్యాపారాన్ని నియంత్రించడానికి పొలిటికల్ లీడర్ ఒకరు సురలిని నియమించుకుంటాడు. సురలి విదేశాలకు వెళ్లి అక్కడి గ్యాంగ్‌స్టర్స్‌తో వైరం పెట్టుకున్న తర్వాత అతను ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనేది ఇందులో చూపించారు. ధనుష్ ఇందులో డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. ఎప్పటిలాగే తనదైన శైలి స్క్రీన్ ప్రెజెన్స్‌తో, యాక్షన్‌తో అదరగొట్టాడు. ఈ యాక్షన్ ప్యాక్‌డ్ ట్రైలర్ వీక్షకులను అలరిస్తోంది. ఇందులో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటించింది. వై నాట్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్.శశికాంత్ ‘జగమే తంత్రం’ చిత్రాన్ని నిర్మించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News