Sunday, April 28, 2024

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.122 తగ్గింపు

- Advertisement -
- Advertisement -

Commercial gas cylinder price reduced by Rs.122

న్యూఢిల్లీ : ఆయిల్ కంపెనీలు ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి. మంగళవారం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.122 తగ్గిస్తూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రతి నెలా మొదటి రోజు గ్యాస్ సిలిండర్ కొత్త రేట్లను కంపెనీలు ప్రకటిస్తాయి. దీనిలో భాగంగా జూన్ 1న 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరను రూ.122 తగ్గించాయి. ఈ తగ్గింపుతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,473.50కు తగ్గనుంది. ఇంతకుముందు సిలిండర్ ధర రూ.1,595.50 ఉంది. మే నెలలో కంపెనీలు గ్యాస్ సిలిండర్‌పై రూ.45 తగ్గించాయి. ఈ రేట్లు ప్రాంతాల వారీగా వేర్వేరుగా ఉంటాయి. ఈనెల 1 నుంచి ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,473.50, ముంబైలో రూ.1,422.50, కోల్‌కతాలో రూ.1,544.50, చెన్నైలో సిలిండర్ రూ.1,603గా ఉంది. మే నెలలో ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1595.50, ముంబైలో రూ.1545, కోల్‌కతాలో రూ.1667.50, చెన్నైలో సిలిండర్ రూ.1725.50గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News