Friday, May 3, 2024

కొలంబియా అధ్యక్షునిగా గుస్తావో పెట్రో ఎన్నిక

- Advertisement -
- Advertisement -

మొట్టమొదటిసారి వామపక్ష ప్రభుత్వం ఏర్పాటు

బొగోట(కొలంబియా): కొలంబియలో మొట్టమొదటిసారి వామపక్ష ప్రభుత్వం ఏర్పడింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఒకప్పటి తిరుగుబాటుదారుడు గుస్తావో పెట్రో ఎన్నికయ్యారు. దేశంలో సాంప్రదాయవాద రాజకీయాలతో విసిగివేసారిన కొలంబియా ప్రజలు మొదటిసారి వామపక్ష అభ్యర్థిని అధ్యక్షుడిగా ఎన్నుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారి రోడాల్ఫో హెర్నాండెజ్‌ను ఓడించారు. పెట్రోకు 50.48 శాతం ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి హెర్నాండెజ్‌కు 47.26 శాతం ఓట్లు దక్కాయి.

అసమానత్వం, ద్రవ్యోల్బణం, హింసతో దశాబ్దాల పాటు తల్లడిల్లుతున్న కొలంబియా ప్రజలు సుదీర్ఘకాలం పాటు పాలిస్తున్న మధ్యేవాద, మితవాద రాజకీయ నాయకులను తమ ఓటుతో శిక్షించారు. అధ్యక్షునిగా ఎన్నికైనట్లు ఫలితాలు వెల్లడి అయిన తర్వాత ఆదివారం రాత్రి పెట్రో దేశప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తన ప్రత్యర్థులపై ఎటువంటి ప్రతీకార చర్యలు ఉండబోవని ప్రకటించారు. ప్రతిపక్ష సభ్యులందరూ ప్రజా సమస్యలను తన వద్దకు వచ్చి చెప్పుకోవచ్చని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News