Thursday, May 2, 2024

రాష్ట్రాలపై భారం వేసిన కేంద్రం: గుత్తా

- Advertisement -
- Advertisement -

Gutta comments on New farm bill

నల్లగొండ: దేశ రాజధానిలో రైతుల ఆందోళన ఆవేదన కలిగిస్తోందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బాధను వ్యక్తంచేశారు. నల్లగొండలో గుత్తా మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు. తెలంగాణలో రైతుల నుంచి ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. రాష్ట్రాలపై భారం వేసి కేంద్రం చేతులు దులుపుకోవాలని చూస్తోందన్నారు. పప్పు ధాన్యాలను కేంద్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ఆయిల్ ఉత్పత్తులపై కేంద్రం ప్రోత్సాహకాలను పెంచాలన్నారు. కొత్త చట్టాలపై రాష్ట్రాలు, రైతులతో చర్చించి కేంద్రం తగ్గిన నిర్ణయం తీసుకోవాలన్నారు. విద్యుత్ చట్ట సవరణతో రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ ఆటంకం ఏర్పడుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News