Monday, April 29, 2024

జ్ఞాన్‌వాపి మసీదు కింద ఆలయం ఆనవాళ్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని జ్ఞ్ఞానవాపి మసీదు ఉన్న స్థలంలో అంతకు ముందు ఒక భారీ హిందూ అలయం ఉన్నట్లు ఈ మసీదు ప్రాంతంలో సర్వే నిర్వహించిన భారత పురావస్తు పరిశోధన శాఖ( ఎఎస్‌ఐ) నివేదిక పే ర్కొన్నట్లు ఈ నివేదికను అందుకున్న హిందూ వర్గాలకు ప్రాతినిధ్యం వహి స్తున్న న్యాయవాది విష్ణు శంకర్ జైన్ గురువారం విలేఖరుల సమావేశం లో తెలియజేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఎఎస్‌ఐ నివేదికను ఈ కేసులోని ఇరు పక్షాలకు అందజేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికను మీడియా సమావేశంలో జైన్ చదివి వినిపించారు. ‘స్తంభాలు, ప్లాస్టర్‌ను తిరిగి ఉప యోగించి మసీదుకు కొన్ని మార్పులు చేసినట్లు ఎఎస్‌ఐ నివేదిక పేర్కొం టోంది. కొత్త నిర్మాణంలో ఉపయోగించడం కోసం హిందూ ఆలయానికి చెందిన కొన్ని స్తంభాలను కొద్దిగా మార్పు చేశారు. స్తంభాలమీద ఉన్న శాసనాలను తొలగించడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి’ అని నివే దికను ఉటంకిస్తూ జైన్ తెలిపారు.

అంతేకాదు దేవనాగరి, తెలుగు, కన్నడ, ఇతర భాషల్లో రాసిన పురాతన హిందూ ఆలయానికి సంబంధించిన శాసనాలను కూడా కనుగొన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నట్లు జైన్ తెలిపా రు. సర్వే సమయంలో ఇప్పుడున్న, ఇంతకు ముందున్న నిర్మాణాలపై ప లు శాసనాలను గుర్తించినట్లు ఎఎస్‌ఐ పేర్కొంది. సర్వే సందర్భంగా మొ త్తం 34 శాసనాలను గుర్తించినట్లు , అలాగే 32 స్టాంపులు వేసిన పత్రాల ను తీసుకున్నట్లు కూడా నివేదికలో పేర్కొన్నట్లు జైన్ తెలిపారు. దీన్ని బట్టి ఇప్పుడున్న కట్టడం నిర్మాణంలో తిరిగి ఉపయోగించడం కోసం అంతకు ముందున్న కట్టడాలను నాశనం చేసి, వాటిలో కొన్ని భాగాలను ఉపయో గించినట్లు స్పష్టమవుతోందని ఆయన తెలిపారు. జనార్దన, రుద్ర, మహేశ్వ ర లాంటి ముగ్గురు దేవతా మూర్తులు పేర్లు కూడా ఈ శాసనాల్లో కూడా కనిపించినట్లు ఆ నివేదికలో ఎఎస్‌ఐ పేర్కొనిందని జైన్ స్పష్టం చేశారు. వారణాసిలోని కాశీ విశ్వేశ్వర ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మ సీదును అంతకు ముందు ఉన్న హిందూ అలయాన్ని కూల్చి వేశారా అనే విషయాన్ని నిర్ధారించడం కోసం కోర్టు ఆదేశాల మేరకు ఎఎస్‌ఐ గత ఏడా ది సైంటిఫిక్ సర్వేను నిర్వహించింది. ఈ నివేదికను ఈ కేసులో కక్షిదా రులైన హిందూ, ముస్లిం వర్గాలు రెండింటికీ ఇవ్వాలని కోర్టు ఆదేశించిం ది. కోర్టు ఆదేశాల మేరకు ఎఎస్‌ఐ నివేదికను ఇరు పక్షాలకు అందజేయ డంతో నివేదికలోని అంశాలు బైటికి వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News