Monday, May 6, 2024

ఆరోగ్య సిద్దిపేటలో భాగంగా హాఫ్ మారథాన్ పోటీలు

- Advertisement -
- Advertisement -
  • ఆగస్టు 6న హాఫ్ మారథాన్ పోటీలు
  • లింక్ ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోని హాఫ్ మారదాన్‌లో పాల్గొనాలని సిపి శ్వేత పిలుపు

సిద్దిపేట: ఆరోగ్య సిద్దిపేటలో బాగంగా హాఫ్ మారథాన్ పోటీలు నిర్వహిస్తున్నామని సిపి శ్వేత అన్నారు. ఆది వారం సిద్దిపేట రన్నింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని కోమటి చెరువు రూబీ నెక్లెస్ వద్ద రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు చోరవతో సిద్దిపేటలో భాగంగా ఆగస్టు 6న సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ ప్రాజెక్టు, సిద్దిపేట డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో 5కె,10 కె,21 కె ఆఫ్ మారథాన్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాఫ్ మారథాన్ పోటీలు సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ సమన్యవంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. సిద్దిపేట జిల్లాలోని చుట్టు పక్కల జిల్లాలు, రాష్ట్రంలో ఆసక్తి గల యువతీ యువకులు ,ఉత్సాహవంతులు ఆఫ్ మారథాన్ రన్నింగ్ పోటీలో పాల్గొనేవారు https://shm23.iq301.com ఈ లింక్‌ను ఓపెన్ చేసి వారి యొక్క వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోని హాఫ్ మారాథాన్‌లో పాల్గొనాలన్నారు.

ఈ లింక్ ఈ నెల 20 తేది నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు 5కె 200 రూ. 10కె రూ. 300,21 కె 5000 గూగల్ పే, పోన్ పే , యూపిఐకోడ్ ద్వారా చెల్లించి పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అందులో గెలుపొందిన వారికి 5కె,10కె,21కె లో గెలుపొందిన వారికి నగదు బహుమతి అందజేస్తామన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకొని రన్నింగ్‌లో పాల్గొనే వారందరికి టీషర్ట్, మెడల్స్ అందజేస్తామన్నారు. హాఫ్ మారాథాన్ పోటీల విషయంలో ఉత్సవ వంతులైన యువతీ యువకులు, పాల్గొనే వారికి ఎమైనా సందేహాలు ఉంటే సిద్దిపేట రన్నింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబురెడ్డి 9440494455, పరందాములు 9010901511, రఘుపతిరెడ్డి 9966935333 నంబర్లకు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి మహేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, కౌన్సిలర్ దీప్తి నాగరాజు, ప్రజాప్రతినిధులు, ట్రాఫిక్ ఎసిపి ఫణిందర్, ఎస్బి ఇన్‌స్పెక్టర్ రఘుపతిరెడ్డి, సిఐలు భానుప్రకాశ్, రామకృష్ణ, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు, వాకర్స్ అసోసియేషన్ మెంబర్లు ,యువతి, యువకులు, ఉద్యోగ ఉపాద్యాయులు, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News