Sunday, April 28, 2024

రైనా బాటలోనే హర్భజన్?

- Advertisement -
- Advertisement -

Harbhajan Singh likely to miss IPL13

ఐపిఎల్ నుంచి తప్పుకోనున్న భజ్జీ!

దుబాయి: ఇప్పటికే కరోనా కల్లోలం సృష్టించడంతో డీలా పడిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు మరో షాక్ ఖాయంగా కనిపిస్తోంది. సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ ఈసారి ఐపిఎల్‌కు దూరమవుతున్నట్టు మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. త్వరలోనే దీనిపై హర్భజన్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే సీనియర్ బ్యాట్స్‌మన్, జట్టు వైస్ కెప్టెన్ సురేశ్ రైనా ఐపిఎల్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో రైనా టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. హర్భజన్ కూడా ఈసారి ఐపిఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలిసింది.

ఈ విషయాన్ని ఇప్పటికే జట్టు యాజమాన్యానికి వివరించినట్టు సమాచారం. ఒకవేళ హర్భజన్ కూడా దూరమైతే చెన్నై కష్టాలు మరింత పెరగడం ఖాయం. అయితే రైనాతో పోల్చితే హర్భజన్ వైదొలిగితే జట్టుకు పెద్దగా ఇబ్బందులు ఉండక పోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చెన్నైలో మరో ముగ్గురు అత్యుత్తమ స్పిన్నర్లు ఉన్నారు. కరణ్ శర్మ, ఇమ్రాన్ తాహిర్‌లతో పాటు ఈ సీజన్‌లో తాజాగా పియూష్ చావ్లా కూడా జట్టులో చేరాడు. దీంతో స్పిన్ విభాగం బలంగానే కనిపిస్తోంది.

Harbhajan Singh likely to miss IPL 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News