Sunday, April 28, 2024

ధరలు పెంచే బిజెపికి ఓటు వేద్దామా?

- Advertisement -
- Advertisement -

కారులో ఎక్కించే పార్టీ టిఆర్ఎస్ కి ఓటు వేద్దామా?

కారుతో తొక్కించే పార్టీ బిజెపికి ఓటు వేద్దామా?

ధరలు పెంచే పార్టీ బీజేపీకి ఓటు వేద్దామా?

పెదలను కడుపులో పెట్టుకుని చూసే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దామా?

టీఆర్ఎస్ ను ఓడించేందుకు కమలం- హస్తం దోస్తీ:ఆర్థికమంత్రి హరీశ్ రావు

కరీంనగర్: ఓటు వేయాల్సి వచ్చినప్పుడు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. హుజూరాబాద్ మండలం కన్నుక గిద్దే, జూపాకలో సోమవారం హరీశ్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎవరో ఏడ్చారని, తిట్టారని, సెంటిమెంట్ మాటలకు పడిపోవద్దన్నారు. హుజూరాబాద్ లో టిఆర్ఎస్ మీద కొట్లాడే శక్తి లేక బిజెపి-కాంగ్రెస్ ఏకమైందన్నారు. రెండున్నర సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, తమని గెలిపిస్తే ఏం చేస్తామో చెప్తామని, బిజెపి కూడా గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలని నిలదీశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా ఎందుకు చేశారని ప్రశ్నించారు. హుజూరాబాద్ కు మెడికల్ కాలేజి కావాలని, జిల్లా కావాలని రాజీనామా చేశారా? అని నిలదీశారు. జూపాక రోడ్డు బాగుండాలని, డబుల్ బెడ్ రూం ఇళ్లు కావాలని రాజీనామా చేశాడా? తన స్వార్థం కోసం రాజీనామా చేశారని అడిగారు. గెల్లు గెలిస్తే హూజూరాబాద్ ప్రజలకు లాభం వస్తుందని, ఈటల గెలిస్తే బిజెపికి లాభం వస్తుందన్నారు. పెద్దమనుషులు ఎవర్ని అడిగినా నా పెద్ద కొడుకు సిఎం కెసిఆర్ అంటున్నారని, ఆయనకే ఓటు వేస్తామన్నారు. 200 రూపాయల పెన్షన్ ను 2000 రూపాయలకు సిఎం కెసిఆర్ పెంచారని గుర్తు చేశారు. దేశంలో 18 బిజెపి పాలిత రాష్ట్రాలు ఉన్నాయని, ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్ లో 2వేల రూపాయలు ఇస్తున్నారా?, గుజరాత్ లో 600 రూపాయల పెన్షన్ ఇస్తున్నారని తెలియజేశారు.

పేదింటి ఆడపిల్లకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని, బిజెపి రాష్ట్రాల్లో ఎక్కడైనా పేదింటి ఆడపిల్లకు ఒక్క రూపాయి సాయిం చేస్తున్నారా? అని నిలదీశారు. కళ్యాణ లక్ష్మితో కడుపు నిండుదని రాజేందర్ అంటున్నాడని, మీరు చెప్పండి కళ్యాణ లక్ష్మి వద్దా? కావాలనుకునే వాళ్లు రాజేందర్ ను చిత్తు చిత్తు ఓడించాలని పిలుపునిచ్చారు. గతంలో బిజెపి- టిడిపి కలిసి ఉన్నప్పుడు, కాంగ్రెస్ హయాంలో నీళ్లకు, కరెంటుకు ఎంత ఇబ్బంది ఉండేదన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా కాలువల్లో నీరు పారుతుండేదని, గత వేసవిలో ఇంక కాలువల్లో నీరు చాలు అనే పరిస్థిత ఉందని, కావల్సినన్ని నీళ్లు కాలువల్లో మొహాన్ని మొగలుకు పెట్టి చూసే పరిస్థితి లేదన్నారు. గతంలో ఎస్సారెస్పీ కాలువలు చూసి నాట్లు వేసే పరిస్థితి ఉందని, మోటారు కాలడం, ట్రాన్స్ ఫార్మర్లు కాలడం, బావుల పూడిక తీత తీయాల్సి వచ్చేదని, పంట పండించిన డబ్బు అంతా వాటికే సరిపోయేదన్నారు.

వానాకాలం, యాసంగికి కలిపి ఎకరానికి పది వేలు రైతు బంధు ఇచ్చిన ప్రభుత్వం టిఆర్ఎసేనని, కరోనా వస్తే ఎమ్మెల్యేల జీతాలు సగమే ఇచ్చారని, సకాలంలో 7500 కోట్ల రూపాయలు టిఆర్ఎస్ ప్రబుత్వం రైతులకు ఇచ్చేదని, అంతే కాడు పండించే వడ్లు, వానాకాలం పంట రేపో మాపో ఐకెపి సెంటర్లు పెట్టి ప్రతీ గింజ ప్రభుత్వం కొంటుందన్నారు.  ఈటల రాజేందర్ ఒక్క ఇళ్లు నిర్మించలేదని, గెల్లు శ్రీనును గెలిపిస్తే మీ జాగాలో మీకే ఇళ్లు కట్టించే కార్యక్రమం చేయిస్తామని హరీష్ స్పష్టం చేశారు. ఒక్కో ఇళ్లుకు 5 లక్షల రూపాయల సాయం చేస్తుందని, ఐదు వేల ఇళ్లు కట్టిస్తామని ఇంకా రెండేళ్లు ఉందని, 30 తేదీ వరకే ఓట్లు అని, సిఎంగా కెసిఆర్ ఉంటారని, తాను ఆర్థిక మంత్రిగా ఉంటానని, చేసేది తామేనని, పని చేసేది టిఆర్ఎస్ ప్రభుత్వం హరీష్ రావు స్పష్టం చేశారు.తాము మాట తప్పితే మీరు ఊర్కుంటరా.. రెండేళ్లలో పూర్తి చేయకపోతే మీరు ఊర్కుంటరా? మంత్రిగా చేయని రాజేందర్, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చేస్తారా? ప్రజలను అడిగారు. 21 రోజుల్లో 16 సార్లు పెట్రోల్, డీజీల్, గ్యాస్ సిలిండర్ ధరలు బిజెపి ప్రభుత్వం పెంచిందని మండిపడ్డారు. బిజెపికి ఓటు వేయడమంటే వేయి రూపాయల సిలిండర్ ధర పెంచడాన్ని ఓప్పుకోవడమే కదా అని అడిగారు.

పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధర రోజు రోజుకు పెరుగుతున్నాయని, అయినా బిజెపికి ఓటు వేద్దామా? అని అడిగారు. లక్ష రూపాయల మాఫీ అప్పు కొంత మిగిలి ఉంది. 25 వేల రూ రుణం మాఫీ చేశాం. 50 వేల లోపు రుణాలు మాఫీ చేస్తున్నాం. 50 వేల నుంచి లక్ష లోపు రుణాలు వడ్డీతో సహా వచ్చే ఉగాది పండుగ తర్వాత బడ్జెట్లో మాఫీ చేస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. బిజెపికి ఏమైనా రైతు రుణమ మాఫీ పాలసీ ఉందా? రైతులపై కార్లు ఎక్కించి చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 నాడు ఆడవాళ్లంతా వంట రూమ్ లో గ్యాస్ సిలండర్ కు దండం పెట్టి బిజెపిని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.  పండుగ పూట తాము వడ్డీలేని రుణం పైసలు ఐదు వేలు, పది వేలు ఇప్పించామని. బిజెపి పార్టీ మాత్రం సిలిండర్ ధరలు పెంచిందని దుయ్యబట్టారు. ధరలు పెంచే పార్టీకి ఓటు వేద్దామా లేక పేద ప్రజలను కడుపులో పెట్టుకునే పార్టీకి ఓటు వేద్దామా అని అడిగారు. 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తాం. అభయ హస్తం డబ్బులు వాపస్ ఇచ్చి 2016 రూపాయల పెన్షన్ ఇస్తాం. మీరు పండించిన పంటను కొంటాం. రైతులకు లక్ష రూపాయల రుణం మాఫీ చేస్తాం. ముదిరాజ్ సోదరులకు లూనాలు ఇస్తాం. ఇది టిఆర్ఎస్ పార్టీతోనే అవుతుంది తప్ప ఇతర పార్టీలతో అవుతుందా? అని అడిగారు. ఈటల రాజేందర్ ఇలాంటి మంచి మాటలు చెప్పారు…తిట్టుడే…తిట్టుడు.. ఘోరీ కడతాం, అగ్గిపెడతా..కూలగొడతా.. ఇవేం మాటలు. సిలిండర్ ధర తగ్గిస్తా అని ఎందుకు చెప్పడం లేదన్నారు.  రాజేందర్ ను ఆరు సార్లు ఎమ్మెల్యే చేసి, రెండు సార్లు మంత్రి చేస్తే…కన్న తల్లి గుండెల మీద తన్నినట్లు టిఆర్ఎస్ పార్టీ గుండెల మీద తన్నిండని, టిఆర్ఎస్ పార్టీ ఎం తక్కువ చేసిందని, బిజెపి రాజేందర్ కు , ప్రజలకు ఎం చేసిందని నిలదీశారు.

ఇవి నల్ల చట్టాలు అని రాజేందర్ అన్నారని. మార్కెట్లు రద్దు అయితది. రైతు కు గిట్టుబాటు ధర దొరకదు , రైతుకు ఉరి తాడు పడుతుంది అన్నావు. మరి ఇప్పుడైనా ఆ చట్టాలు రద్దు అయిందా? అని దుయ్యబట్టారు. ఆ సంగతి ఎందుకు మట్లాడటం లేదని, విదేశాల నుంచి నల్ల ధనం తెచ్చి మీ అక్కాంట్లలో 15 లక్షలు వేస్తం అన్నారని, ఒక్క రూపాయి వేశారా? అని నిలదీశారు. పెద్ద నోట్ల రద్దు అన్నప్పుడు… బ్యాంకుల ముందు లైన్లో నిలబెట్టండు. జీరో అక్కౌంట్లు, జన్ ధన్ అక్కౌంట్లలో నల్ల ధనం వస్తుంది అన్నరు. ఒక్క రూపాయి ఇచ్చారా? బిజెపోళ్లను హరీష్ రావు అడిగారు. ఎడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారని, విశాఖ ఉక్కును అమ్మారు, ఎల్ ఐసిని అమ్మారు. రైళ్లు, విమానాశ్రయాలు అమ్ముతున్నారని మండిపడ్డారు. ఎస్సీలకు, ఓబీసీలకు రిజర్వేషన్లు ఊడగొడుతున్నారని, ఉద్యోగులను రోడ్డు మీదకు తెస్తున్నారని మండిపడ్డారు.  గెల్లు శీనుకు తోడుగా ప్రతీ 15 రోజులకు హుజూరాబాద్ కు వచ్చి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా మీ పన్నులన్నీ చేయిస్తానన్నారు. రాజేందర్ గెలిచేది లేదని, మంత్రి అయ్యేది లేదని, అతనితో పని జరగదన్నారు. మన జీవితాలు కరాబు చేసుకుంటామా… ఆయన అంటించుకున్న బురద అందరికీ అంటిచాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.

పేదల కోసం పని చేసే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని, సిలిండర్ ధర వేయి రూపాయలు బిజెపోళ్లు చేసిండ్రని, రోజు కేంద్ర మంత్రులు వస్తున్నారని. కిషన్ రెడ్డి, మురళీధరన్, స్మృతీ ఇరానీతో సిలిండర్ ధర తగ్గించమని చెప్పించాలన్నారు.291 రూపాయల పన్ను రాష్ట్ర ప్రభుత్వం వేస్తోందని రాజేందర్ మాపై బదనాం పెట్టిండ్రని,  నిజంగా 291 రూ. రాష్ట్ర పన్ను వేస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తానని, అంబేద్కర్ విగ్రహం దగ్గరకు రా అని సవాల్ విసిరినని, ఈటెల రాలేదన్నారు. గెల్లును గెలిపించిండి. ఉద్యమ కారుడు. తెలంగాణ కోసం జైలుకు వెళ్లిన వాడు. 30న కారు గుర్తు కు వేసి సేవ చేసే అదృష్టం కల్పించండిని ప్రజలను హరీష్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News