Saturday, April 27, 2024

బిజెపిదే హుజూరాబాద్

- Advertisement -
- Advertisement -
BJP win huzurabad by-election 2021
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ గెలుపు
పోరాడి ఓడిన గెల్లు
కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు
మెజార్టీ 23,855
పోరాడి ఓడిన టిఆర్‌ఎస్
డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్

మన తెలంగాణ/హైదరాబాద్/కరీంనగర్ : హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి ఈటల రాజేందర్ 23,855 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధి విజయం కోసం చివరకు పోరాడి ఓటమిపాలయ్యారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరీ దయనీయమైన స్థితిలో నిలిచింది. ఆ పార్టీకి కనీసం డిపాజిట్‌కు కూడా దక్కలేదు. కేవలం మూడువేల ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందంటే పార్టీ పరిస్థితి ఎంత దిగజారిందో తెలుస్తోంది. కాగా ఈ సెగ్మెంట్‌లో ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు ఎప్పుడు ఇంత తక్కువగా ఓట్లు వచ్చిన దాఖలాలు లేవు. బరిలో మూడు ప్రధాన పార్టీలతో పాటు మరో 27 మంది స్వతంత్య్ర అభ్యర్ధులుగా పోటీ చేశారు. అయితే వారికి పెద్దగా ఓట్ల పడలేదు. పోలింగ్ శాతం మొత్తాన్ని దాదాపుగా బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీలే పంచుకున్నాయి. దీని కారణంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్ధులతో పోటీ పడాల్సి వచ్చింది.

హుజూరాబాద్‌లో మొత్తం 2,36,873 ఓటర్లు ఉండగా 2,05,236 ఓట్లు పోలయ్యాయి. ఇందులో బిజెపికి మొత్తం 1,07,022 (51.96 శాతం) ఓట్లు రాగా, టిఆర్‌ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు 83,167 (40.48 శాతం) ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ది బల్మూరి వెంకట్ నామమాత్రంగా కేవలం 3,014 (1.46 శాతం) ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం 22 రౌండ్ల వారిగా ఓట్ల లెక్కింపు జరిగింది. ఇందులో టిఆర్‌ఎస్ పార్టీ రెండు రౌండ్లలో ఆధిక్యాన్ని ప్రదర్శించగా, బిజెపి మిగిలిన 20 రౌండ్లలో తన ఆధిక్యాన్ని చాటుకుంది. కాగా కాంగ్రెస్ పార్టీ ఏ రౌండ్‌లోనూ టిఆర్‌ఎస్, బిజెపిలకు కనీస స్థాయిలోకి పోటీ ఇవ్వలేక చతికిలపడింది. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగ మొదటి పోస్టల్ బ్యాలెట్లను ఓట్లను లెక్కించారు. ఇందులో టిఆర్‌ఎస్ తన సత్తాను చాటుకుంది. బిజెపిపై 344 ఓట్ల మెజార్టీ సాధించింది. మొత్తం పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు 723 రాగా అందులో టిఆర్‌ఎస్‌కు503, బిజెపికి159, కాంగ్రెస్‌కు32 ఓట్లు వచ్చాయి. కాగా మరో 14 ఓట్లు చెల్లకుండాపోయాయి.

పోరాడి ఓడిన గెల్లు

మొదటి సారిగా అసెంబ్లీ బరిలోకి టిఆర్‌ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆపార రాజకీయ అనుభవం ఉన్న బిజెపి అభ్యర్ధి ఈటల రాజేందర్‌కు గట్టిపోటి ఇచ్చారు. ఈ నియోజకవర్గం నుంచి వరసగా ఆరు సార్లు గెలిచిన ఈటలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఎన్నికల ప్రచారం చేయడమే కాకుండా పోలింగ్ లెక్కింపులో చివరి రౌండ్ వరకు కమలంతో తన పోరాటం కొనసాగించారు. అన్ని వరస రౌండ్లలో బిజెపి ఆధిక్యం కొనసాగించినప్పటికీ 8,11 రౌండ్లలో మాత్రం గెల్లు తన స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించగలిగారు. ఆయన పోరాట పటిమకు టిఆర్‌ఎస్ శ్రేణులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. గెల్లుకు మరికొంత ప్రచార వ్యవధి లభించి ఉంటే పరిస్థితి మరో విధంగా వచ్చి ఉండేదని గులాబీ నేతలు పేర్కొంటున్నారు.

BJP win huzurabad by-election 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News