Saturday, May 4, 2024

హయత్‌నగర్ రాజేష్ మృతి కేసుల్లో వీడిన మిస్టరీ

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్: హయత్‌నగర్ ఠాణా పరిధిలో రాజేష్ (25), ప్ర భుత్వ ఉపాధ్యాయురాలు సుజాతలు (45) ఇద్దరు ఆత్మహత్య చేసు కున్నట్లుగా నిర్థ్దారించారు. ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో రాచకొండ కమిషనర్ సిపి డిఎస్ చౌహాన్ విలేకరుల సమావేశంలో వారిద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. ముందుగా సుజాత ఆత్మాహ త్యయత్నం చేసుకొని ఆసుపత్రిలో మృతి చెందిందని పేర్కొన్నారు. అనంతరం రాజేష్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. రాజేష్ , సుజాతకు వివాహేతర సంబంధం ఉన్నట్లు సేకరించినట్లు పేర్కొన్నారు. రాజేష్‌కు ఆరు నెలల క్రితం మిస్డ్ కాల్‌తో కలిశారు. మిస్డ్ కాల్‌తో ఇద్దరు లోతుగా చనువు పెంచుకున్నారు. దీంతో ఆమె ఫొటో చూసి పెళ్లి చేసుకోవాలని రాజేష్ నిర్ణయించుకున్నాడు. రా జేష్ ప్రతి రోజు ఆమె ఇంటి చుట్టు తిరిగేవాడు. సుజాత రాజేష్ సంబంధం గు రించి ఆమె కొడుకు జయచంద్రకు తెలిసింది. జయచంద్ర రాజేష్‌ను కొట్టడం జరిగింది. రాజేష్ మృతికి జయచంద్ర కొ ట్టినందుకు రాజేష్ పోస్టుమార్టం రిపోర్టులో ఎలాంటి గాయాలు లేవన్నారు. దీంతో అ తని మృతికి గాయాలు కారణం కాదని తే లింది. సీసీ పుటేజీల ఆధా రంగా పురుగుల మందు కొనుగోలు చేసి ఇద్దరు చని పోవాలని నిర్ణయించుకున్నారు. మే 24న సుజాత పురుగుల మందు తాగింది. దీంతో తన తల్లి చావు బతుకుల మధ్య ఉందని సుజాత కొడుకు రాజేష్‌కు తెలిపాడు. అదే రోజు రాజేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఈకేసును ఛేదించామని తెలిపారు. ఈ కేసుపై ఇంకా దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News