Wednesday, May 15, 2024

ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా విడుదల

- Advertisement -
- Advertisement -

Professor Sai Baba acquited

నాగ్‌పుర్: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో నాగ్‌పుర్ జైలులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ జి.ఎన్. సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. ఆయనతో పాటు మరో ఐదుగురిని కూడా నిర్దోషులుగా తేల్చింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో వీరిని 2014లో అరెస్టు చేశారు. 2017లో సెషన్స్ కోర్టు వీరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. అప్పటి నుంచి వారు నాగ్‌పుర్ కేంద్ర కారాగారంలో ఖైదు జీవితాన్ని అనుభవిస్తున్నారు. వారు తమ శిక్షను సవాలు చేస్తూ బాంబే హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. వారి అప్పీళ్లను విచారించిన కోర్టు వారిని నిర్దోషులుగా గుర్తిస్తూ తీర్పు చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News