Sunday, December 15, 2024

శీతాకాలంలో ఆరెంజ్ తింటున్నారా?

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే చలికాలం మొదలైంది. చలి దానితో పాటు అనేక వ్యాధులను తెస్తుంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం కారణంగా పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ చలి కాలంలో కొంచెం అజాగ్రత్తగా ఉంటే అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడవచ్చు. అయితే, వీటి నుండి మనల్ని మనమే కాపాడుకోవాలి. మనకు ఎంత ఎక్కువ అవగాహన కలిగి ఉంటే మనల్ని మనం అంత సురక్షితంగా ఉంచుకోగలుగుతాం. చలికాలంలో ఏదైనా వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవాలంటే.. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అందులో భాగంగానే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవచ్చు, వ్యాయామం కూడా చేయవచ్చు. అయితే ఈ వార్త ద్వారా మనం శీతాకాలంలో ఆరెంజ్ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తి

నారింజలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరం నుండి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చలి రోజుల్లో తప్పనిసరిగా నారింజను తీసుకోవాలి. రోజూ ఒక ఆరెంజ్ తింటే చలిలో కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు.

బీపీ ని నియంత్రించవచ్చు

రక్తపోటుకు సంబంధించిన సమస్యలతో పోరాడుతున్నట్లయితే, చల్లని రోజుల్లో ప్రతిరోజూ ఒక నారింజ తీసుకోవడం చాలా మంచిది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే నారింజలో ఇటువంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. అంతే కాకుండా.. ఆరెంజ్ తినడం వల్ల బీపీ సమస్య కూడా తగ్గుతుంది.

రక్తహీనత

నారింజలో ఉండే విటమిన్ సి రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక నారింజను తింటే, అది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే చలి రోజుల్లో రోజూ ఆరెంజ్ తినడం మంచిది.

క్యాన్సర్‌

నారింజలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి గుణాలు ఉంటాయి. ఇందులో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడుతుంది. అదనంగా ఇది క్యాన్సర్ నుండి కూడా రక్షిస్తుంది. ఇలా రోజూ నారింజ పండ్లను తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News