Sunday, April 28, 2024

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం

- Advertisement -
- Advertisement -

Heavy Rains Hits Telangana next three days

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం వర్షం కురుస్తోంది. ఒయు క్యాంపస్, నాచారం, హబ్సిగూడ, మల్లాపూర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, రాంనగర్, విద్యానగర్, కావాడిగూడ, భోలక్ పూర్, హకీంపేట, జీడిమెట్ల, షాపూర్ నగర్, చింతల్, సూరారంలో వర్షం పడుతుంది. అటు నైరుతి రుతుపవనాలు కేరళ అంతటా విస్తరించాయి. తమిళనాడు, కర్నాటక, ఎపిలో కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. రాగల 2,3 రోజుల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి దిశ నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని, దాని ప్రభావంతో రాగల మూడ్రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురువనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులుతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News