Friday, April 26, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం

- Advertisement -
- Advertisement -

Heavy rains in joint Warangal district

వరంగల్: వరంగల్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కిస్తాపురంలో వడగళ్ల వర్షం పడింది. దానివల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అటవీ ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడ మండలంలో వర్షం ప్రారంభమైంది. అక్కడక్కడ భారీ వర్షం కురిసినప్పటికి కిస్తాపురంలో వడగళ్ల వర్షం కురిసింది. అక్కడి నుండి వరంగల్ రూరల్ జిల్లాలో రాత్రి 6.30 గంటల నుండి 7 గంటల వరకు వర్షం కురిసింది. ఈ వర్షానికి రైస్‌మిల్లుల్లో నిల్వ చేసిన ధాన్యం కొంత మేరకు తడిసింది. మిర్చి పంటకు ఈవర్షం నష్టం చేసినట్లయింది. చపాట దొడ్డురకం మిర్చికి అకాల వర్షం వల్ల తడిసి కాయ రంగు మారడానికి అవకాశం ఏర్పడింది. దీనివల్ల మిర్చి రైతులకు పంట చేతికొచ్చే సమయంలోనే అకాల వర్షం నష్టం చేసినట్లయింది. వాతావరణం మారుతున్న సమయంలోనే రైతులు, మిల్లర్లు ధాన్యాన్ని నిల్వ చేసుకున్న వారంతా అలర్ట్ అయ్యేసరికే వర్షం కురవడం నష్టానికి గురి చేసినట్లయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News