Saturday, May 4, 2024

మహిళల సమస్యకు జవాబు చెప్పే సినిమా

- Advertisement -
- Advertisement -

వర్సటైల్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇటి’. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ పాండిరాజ్ మాట్లాడుతూ “ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్‌ను చూస్తారు. యాక్షన్ ఎలిమెంట్స్‌లోనూ ఓ ఎమోషన్‌ను జోడించాం. రామ్, లక్ష్మన్ మాస్టర్స్ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు. మహిళల గురించి చెప్పే సినిమా ఇది. మహిళలు ఎదుర్కొనే సమస్యకు జవాబును సూచించే సినిమా ఇదని చెప్పగలను. ఈ సినిమాకు తెలుగులో సూర్య సొంతంగా డబ్బింగ్ చెప్పారు. తమిళంలో కంటే తెలుగు డబ్బింగ్ సమయంలోనే ఎక్కువ ఎంజాయ్ చేసి మరీ చెప్పారు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News