Thursday, May 2, 2024

పక్కింటి అమ్మాయిలా కనిపిస్తా

- Advertisement -
- Advertisement -

 

Heroine vasanthi act in cauliflower movie

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా పరిచయమైన సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం ‘క్యాలీ ఫ్లవర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈనెల 26న థియేటర్స్‌లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ వాసంతి మీడియాతో మాట్లాడుతూ “ఈ చిత్రంలో బావ వెంటపడుతూ చలాకీగా తిరిగే అమ్మాయి నీలవేణి పాత్ర నాది.

ఇందులో పక్కింటి అమ్మాయిలా కనిపిస్తా. సినిమా అంతా లంగావోణిలో కనిపిస్తాను. సంపూ పాత్రలో రెండు వేరియేషన్‌లుంటాయి. క్యాలీఫ్లవర్ క్యారెక్టర్‌కు మరదలైన నేను ఆయన వెంట పడుతూనే ఉంటాను. కానీ ఆయన నన్ను పట్టించుకోరు. క్యాలీఫ్లవర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారో దర్శకుడినే అడగాలి. కానీ ఇది చాలా యూనిక్‌గా ఉంటుంది. సంపూకి ఈ టైటిల్ సెట్ అవుతుంది. ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కామెడీ, సస్పెన్స్, థ్రిల్లింగ్, మెసెజ్… ఇలా సినిమాలో అన్నీ ఉంటాయి”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News