Friday, April 26, 2024

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ

- Advertisement -
- Advertisement -

high court hearing on corona conditions in telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. విచారణకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు హాజరయ్యారు. లాక్ డౌన్, కరోనా నిబంధనల అమలుపై నివేదికను డిజిపి సమర్పించారు. ఔషధాల బ్లాక్ మార్కెట్ పై 98 కేసులు నమోదు చేశామని డిజిపి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద 57 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని డిజిపి తెలిపారు. తెలంగాణలో కరోనా పరిస్థితిలో ప్రభుత్వం లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసిందని హైకోర్టు అభిప్రాయపడింది. గైడ్ లైన్స్ పక్కాగా ఫాలో అయ్యేలా చర్యలు తీసుకున్నారని కొనియాడింది. ప్రభుత్వంతో పాటు ముగ్గురు సిపిలను కూడా న్యాయస్థానం అభినందించింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు, అమలు ప్రస్తుతం కరోనా పరిస్థితులపై ఆరా తీసింది.

high court hearing on corona conditions in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News