Friday, May 3, 2024

కమాండ్ కంట్రోల్ నిర్మాణానికి రూ. 550 కోట్లు

- Advertisement -
- Advertisement -

 command control room

 

డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని సంకల్పం, పోలీసు భద్రతకు రూ. 5,852 కోట్ల నిధులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రూ. 5,852 కోట్ల నిధులను కేటాయించారు. పోలీసుశాఖ ఆధునీకరణకు పెద్దపీట వేస్తూ కమాండ్ కంట్రోల్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తూ అధిక నిధులు కేటాయించింది. దేశవ్యాప్తంగా రోల్‌మాడల్‌గా నిలిచిన షీటీమ్స్, ఫేస్ రికగ్నేషన్, భరోసా సెంటర్లను మరింత బలోపేతం చేసేందుకు ఆర్థికంగా సహకారం అందించింది. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ భారీ ప్రాజెక్టుకు ఏకంగా 550 కోట్ల రూపాయలను దీనికోసం ప్రతిపాదించింది.

పోలీసు వ్యవస్థను ఆధునికీకరించడంలో భాగంగా కెసిఆర్ సర్కార్ నిర్మిస్తోన్న కంట్రోల్ సెంటర్‌కు భారీగా నిధులను కేటాయించింది. ముందుగా ప్రకటించిన మొత్తం కంటే అధిక నిధులను బడ్జెట్ ప్రతిపాదనల్లోకి చేర్చింది. ఈ భారీ ప్రాజెక్టు కోసం 350 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయిస్తామని ఇదివరకు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకున్న ఆర్ సర్కార్ హామీ ఇచ్చిన దాని కంటే 200 కోట్ల రూపాయల మొత్తాన్ని అధికంగా కేటాయించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ టవర్ అందుబాటులోకి వచ్చేలా నిర్మాణాన్ని పూర్తి చేయడానికే ఆశించిన దాని కంటే అధికంగా నిధులను కేటాయించినట్లు వివరించారు.

 

Higher funding for command control construction
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News