Monday, April 29, 2024

పల్లెకు పట్టం

- Advertisement -
- Advertisement -

Panchayati Raj branch

 

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి 23,005 కోట్ల కేటాయింపులు
గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కోసం రూ.600 కోట్లు
36 వేల మంది పారిశుద్ధ్య కర్మచారుల వేతనాలకు రూ. 8500లకు పెంపు
పట్టణ మిషన్ భగీరథలోమిగిలిన 38మున్సిపాలిటీలకు 800 కోట్లు

మన తెలంగాణ/ హైదరాబాద్ : 2020-2021 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు భారీగా కేటాయింపులు జరిగాయి. మొత్తం రూ.23,005 కోట్లను కేటాయించారు. పట్టణాలతో సమానంగా గ్రామాలను అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పం. ఈ నేపథ్యంలో పల్లె ప్రగతి పేరుతో ఇప్పటికే రెండు సార్లు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పెద్దఎత్తున పారిశుద్ధ కార్యక్రలను చేపడుతోంది. అలాగే అధ్వానంగా మారిన రహదారులకు యుద్దప్రాతిపదికన మరమ్మత్తులు నిర్వహిస్తోంది.

ఇక అడ్డదిడ్డంగా ఉన్న కరెంటు తీగలను సరిచేయడం, పాడుబడ్డ బావులను పూడ్చివేయడం, రహదారులకు ఇరవైపుల పెద్దఎత్తున మొక్కలను నాటడం వంటి కార్యక్రమలను పంచాయతీల్లో పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లోనూ భారీగా నిధులను కేటాయించింది. ఇక గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కోసం ప్రత్యేకంగా మరో రూ.600 కోట్ల కేటాయింపులు చేసింది. ఇ క పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ, కర్మచారుల వేతనాలను రూ. 8500కు పెంచింది. అలాగే గ్రామాల్లో పనిచేస్తున్న సిబ్బందికి 2 లక్షల జీవిత బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నది. ఇక పట్టణ మిషన్ భగీరథ కింద నీళ్ళు అందించాల్సిన 38 మున్సిపాలిటీలకుగానూ ప్రభుత్వం రూ. 800 కోట్లను కేటాయించింది.

సిఎంకు కృతజ్ఞతలు : మంత్రి ఎర్రబెల్లి
బడ్జెట్‌లో పంచాయతీ, గ్రామీణాభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయించినందుకుగానూ ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అసెంబ్లీలోని సిఎం కెసిఆర్ ఛాంబర్‌కు వెళ్ళి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పటిష్టమైన పంచాయతీరాజ్ చట్టం తేవడం ద్వారా గ్రామాల అభివృద్ధి కీలకంగా మారిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు జావాబుదారి తనం పెరిగిందన్నారు. సమగ్ర గ్రామీణ విధానం అమలు ద్వారా జరుగుతున్న అభివృద్ధితో గ్రామాల్లో ముఖ చిత్రాలను మార్చే వీలు కలుగుతుందన్నారు. ముఖ్యంగా పల్లెప్రగతిద్వారా పల్లెల్లో పచ్చధనం…పరిశుభ్రత నెలకొందన్నారు. ప్రజలే స్వచ్చందంగా భాగస్వాములు అవుతున్నారని వ్యాఖ్యానించారు.

Huge Funds to Panchayati Raj branch
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News