Monday, May 6, 2024

దేశంలో కరోనా విజృంభణ.. 90వేలు దాటిన కేసులు

- Advertisement -
- Advertisement -

Covid-19

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కోవిడ్ కేసులు 90వేలు దాటాయి. భారత్ లో గత 24 గంటల్లో 120 మరణాలు, 4,987 కోవిడ్-19 పాజిటివ్ కేసుల నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,927కు పెరిగింది. వీటిలో 53,946 యాక్టివ్ కేసులుండగా… 34,109 నయమై కోలుకున్నారు. ఇండియాలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 2,872కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

అటు ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలకు కరోనా మహమ్మారి సోకింది. ప్రపంచంలో 47.15 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ -19 తో 3.12లక్షల మందకి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలపి ఈ వైరస్ మహమ్మారితో 18లక్షల మంది కోలుకున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభణ కోనసాగుతోంది. యుఎస్ లో గడిచిన 24గంటల్లో 21 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో అమెరికాలో కరోనా కేసులు 15.6లక్షలు దాటాయి. కరోనా మృతులు అమెరికాలో 89,538కు చేరాయి.

highest ever spike of 4987 Covid 19 cases in india

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News