Monday, April 29, 2024

మాంసం విక్రయదారులూ ఖబడ్డార్

- Advertisement -
- Advertisement -
mutton
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు…

హైదరాబాద్ : మాంసం అమ్మే దుకాణాదారులు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. రాష్ట్రంలో కంటైన్‌మెంట్ ఏరియాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో షాపులు తెరుచుకుంటున్నాయి. నాన్ వెజ్ షాపులను కూడా అనుమతిస్తున్నారు. ప్రధానంగా నాన్‌వెజ్ అమ్మే దుకాణదారులు పరిశుభ్రతలో కచ్చితత్వం వహించాల్సి ఉంటుంది. దుకాణాల్లో కంపల్సరీగా చెత్తబుట్టలు ఉండాల్సిందే. ఆ చెత్తవేసే బిన్‌లకు రంధ్రాలు ఉండకూడదు.

ఇక మాంసాన్ని కోసే కత్తులను వేడి నీటితో కడగాల్సి ఉంటుంది. షాపుల్లో పనిచేసేవారు తప్పనిసరిగా ఆప్రాన్, గ్లౌజులు, హెడ్ గేర్ ధరించాలి. చర్మవ్యాధులు ఉన్నవారు దుకాణాల్లో పనిచేయకూడదు. దుకాణాల్లో పనిచేసే వారు గోర్లు పెంచుకోరాదు. ప్రధానంగా పరిశుభ్రత విషయంలో నాన్‌వెజ్ దుకాణదారులు అప్రమత్తంగా ఉండాలి. దుకాణాలను ఎప్పటికప్పుడు బ్లీచింగ్‌తో శుభ్రపర్చాలి. మాంసం మీద ఈగలు వాలకుండా జాగ్రత్త వహించాలి. ఇక వ్యర్థాలను బయటపడేయరాదు.

టన్నుకంటే తక్కువ వుంటే భూమిలో పూడ్చి పెట్టాలి. అంతకంటే ఎక్కువ ఉంటే బయో మోథనేషన్ ద్వారా నిర్మూలించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు అతిక్రమించిన నాన్‌వెజ్ దుకాణాదారులపై కఠిన చర్యలు తీసుకోగలమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

పర్యవేక్షిస్తాం.. నిబంధనలు ఉల్లంఘిస్తే….

నేడు ఆదివారం కావడంతో నాన్‌వెజ్ దుకాణాల్లో రద్దీ ఎక్కువగా ఉండటం సహజం. ఈ పరిస్థితుల్లో నిబంధనల పట్ల దుకాణాదారులు కచ్చితత్వాన్ని ప్రదర్శించాలి. అలా కాని పక్షంలో వారిపై కఠినాతి కఠిన చర్యలకు అధికారులు ఉపక్రమిస్తున్నారు. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘన జరిగితే సహించేది లేదని.. అక్కడికక్కడే చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరి నిబంధనల విషయంలో నాన్‌వెజ్ దుకాణాదారులు ఏ మేర కచ్చితత్వాని పాటిస్తారు? అన్నది చూడాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News