Friday, April 26, 2024

రంగులు నింపే హోలీ

- Advertisement -
- Advertisement -
Holi Festival

హోలీ అనగానే రంగుల పండుగ. చిన్నాపెద్దా సరదాగా జరుపుకునే వేడుక. సహజ రంగులు ఎంచుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి నష్టం కలగకుండా ఉంటుంది. కొన్ని రసాయన రంగులను వాడకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయని వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా రంగు రుద్దినట్లయితే దాన్ని సబ్బుతో కాకుండా ఫేస్‌వాష్‌తో కడగాలి. కానీ కడిగేటప్పుడు చర్మంపై అంటిన రంగుని రుద్ది రుద్ది కడగకూడదు. ముఖంపై దురద పెడితే గ్లిజరిన్, రోజ్‌వాటర్ కలిపి ముఖంపై రాసుకుని కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే దురద నుండి ఉపశమనం కలుగుతుంది.
హోలీ రోజు చర్మాన్ని రంగుల నుండి కాపాడేందుకు మొత్తం శరీరాన్ని కప్పే బట్టలు వేసుకుంటే రంగు తక్కువ భాగాలపై పడుతుంది.
రంగులో ఉన్న రసాయనాలు జీవితాల్ని చీకటిమయం చేయకూడదు. తడి రసాయన రంగుల్లో కూడా కాపర్ సల్ఫేట్, మెర్క్యూరీ సల్ఫేట్, క్రోమియం లాంటి కర్బన, బెంజీన్ లాంటి ప్రమాదకర ఎరోమెటిక్ సమ్మేళనాలుం టాయి. సిల్వర్ రంగులో ఉండే బ్రొమైడ్, ఎర్ర రంగులో ఉండే మెర్య్యూరీ సల్ఫైడ్ చర్మ కేన్సర్‌కు దారి తీయొచ్చు. దీంతో పొడిబారటం, దద్దుర్లు, మంట, మచ్చలు, ఎలర్జిక్ డెర్మటైటిస్‌తోపాటు కొన్ని కేసుల్లో చర్మం మాడిపోతుంది. ఇలాంటప్పుడు రసాయనాల్లో ఉన్న సూక్ష్మతత్వాలు, చర్మంలో చేరి స్కిన్ కేన్సర్‌కు కారణమవుతాయి.

Holi
ఇలాంటి సమస్యలు, వ్యాధుల నుంచి రక్షించుకునేందుకు హోలీని ఔషధ రంగులతో జరుపుకోవాలి. మెరిసే పెయింట్లు, బురద, గ్రీజులతో జరుపుకుంటుంటారు కొందరు. అలా జరుపుకోకూడదు. చెవులు, నోరు, కళ్లలో రంగు పడితే వెంటనే కడుక్కోవాలి.
రంగుల్లో కొట్టుకుపోవద్దు
రసాయన రంగులతోపాటు, భంగు మత్తు పదార్థాలు, నకిలీ కోవా డ్రింక్స్ తాగటం చాలా ప్రమాదకరం. భంగు తాగేవారిలో యూఫోరియా, యాంగ్జైటీ, సైకోమోటర్ ఫెర్మార్మెన్స్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఒక పరిశోధన ప్రకారం ఎవరైనా 15 సంవత్సరాల నుంచి భంగు తాగుతున్నట్లయితే 26 ఏళ్ల వయసులో మానసిక రోగాలు వచ్చే అవకాశం 4రెట్లు పెరుగుతుంది.
మహిళలు భంగు తాగితే తల్లి అయ్యే సామర్థం దెబ్బతింటుంది. గర్భస్థ మహిళలు భంగు తాగితే పిండంపై కూడా చెడు ప్రభావం పడుతుంది. భంగు తాగటం వల్ల ఆకలి తగ్గటం, నిద్ర రాకపోవడం, బరువు తగ్గటం, చిరాకు, కుంగుబాటు, నిస్పృహ, కోపం వంటి లక్షణాలు మొదలవుతాయి. దీని దీర్ఘకాలిక ప్రభావం మెదడు ఎదుగుదలకు హాని కలిగిస్తుంది.

Holi telugu essay

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News