Tuesday, May 14, 2024

తక్షణ చికిత్సకు వంటిల్లు

- Advertisement -
- Advertisement -

Home tips

 

వంటిల్లు అంటే రుచికరమైన వంటల్ని అందించేదే కాదు అత్యవసర సమయంలో ఆదుకునేది కూడా.

వంట చేసేటప్పుడు కాలినా, వేణ్ణీళ్లు లేదా నూనె పడి బొబ్బలు ఎక్కినా ఉల్లిపాయను సగానికి కోసి కాలిన గాయం మీద పెట్టి నొప్పి తగ్గేవరకు ఉంచాలి. ఉల్లిరసంలో ఉండే సల్ఫర్ వంటి రసాయనాలతో పాటు క్వెర్‌సెటిన్ (ఔషధాల్లో ఉంటుంది)లు బాధ నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి.
* విపరీతమైన ఒత్తిడి, సరిపడా విశ్రాంతి లేకపోవడం వల్ల , వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే తలనొప్పులకు మంచి మందు దొరికే చోటు వంటిల్లు.

* ఫ్రోజెన్ (డీప్ ఫ్రిజ్‌లో ఉంచితే గట్టిపడ్డ) బఠాణీల బ్యాగ్‌ను నొప్పి మైగ్రేన్ నొప్పి ఉన్న ప్రాంతంలో పది నిమిషాల సేపు ఉంచాలి. 20 నిమిషాలు ఆగి మరో పది నిమిషాలు ఫ్రోజెన్ బఠాణీల బ్యాగ్‌ను ఉంచాలి. బఠాణీల బ్యాగే ఎందుకు అంటే దాన్నయితే ఎటంటే అటు మడిచేయొచ్చు, తిరిగి ఐస్ ప్యాక్‌గా కూడా వాడొచ్చు. అతి చల్లదనం రక్త నాళాల మీద ఒత్తిడి కలిగించి ఉపశమనం కలిగిస్తుంది.

* రాత్రిళ్లు ఎక్కువ సేపు మెలకువగా ఉండడం, తక్కువ నీళ్లు తాగడం, వయసు ప్రభావం వల్ల కళ్ల చుట్టూ ఉబ్బుతుంది. ఈ ఉబ్బు కంటికింది భాగంలోని త్వచంలో ద్రవాలు చేరడం వల్ల ఏర్పడుతుంది. చర్మం మీద ఎక్కడ వాపు వచ్చినా చల్లదనాన్ని మించిన ఇంటి చికిత్స మరోటి లేదు. ఈ వాపు తగ్గాలంటే ఉదయం లేదా సాయంత్రం టీ తాగిన తరువాత టీ బ్యాగులను రిఫ్రిజిరేటర్‌లో పెట్టి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. టీనీళ్లు కారిపోయి ముఖంపై కారకుండా ఉండేందుకు టీ బ్యాగులను ఒకసారి పిండాలి. ఆ తరువాత కళ్ల మీద పెట్టి పది నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల కంటి చుట్టూ ఉండే ఉబ్బు తగ్గడమే కాకుండా నల్లటి వలయాలు కూడా తగ్గిపోతాయి. ఇలా చేసిన తరువాత ఎంతో తాజాగా ఉంటుంది కూడా.

Home tips for Health
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News